Nara Lokesh: 'ఫైనల్ మ్యాచ్‌కి టికెట్ కూడా నేను తీయిస్తా'.. జగన్ కోసం లోకేశ్ ప్రత్యేక ఆఫర్!
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ఆఫర్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరితే ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు తాను తప్పకుండా వెళ్తానని చెప్పారు. అంతేకాదు పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ రావాలనుకుంటే ఆయనకూ టికెట్ తానే కొనిస్తానని సెటైర్ వేశారు. ఇటీవల లోకేశ్‌పై జగన్ చేసిన విమర్శలకు ఇది ఘాటైన కౌంటర్‌గా మారింది. క్రికెట్ మ్యాచ్ చూడటానికి ప్రత్యేక విమానంలో లోకేశ్ ప్రయాణిస్తున్నారని జగన్ ఆరోపించారు. మంత్రి ఇలా తిరగడం సరైనదా? అని ప్రశ్నించారు. మ్యాచ్ చూడటానికి కొలంబో వెళ్లాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ఇంట్లోనే టీవీలో చూస్తే సరిపోతుందని సూచించారు. తాను కూడా భారత్ మ్యాచ్‌ను టీవీలోనే వీక్షించానని జగన్ తెలిపారు.
Details
కల్తీ నెయ్యి, హెరిటేజ్ వివాదం
ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన లోకేశ్, భారత్ ఫైనల్‌కు వెళ్తే తాను స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూస్తానని, జగన్ కూడా రావాలనుకుంటే టికెట్ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యానించారు. కల్తీ నెయ్యి, హెరిటేజ్ అంశాలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి లోకేశ్ ఖండించారు. కిలో నెయ్యి 360 రూపాయలకు ఎక్కడ లభిస్తుందో చూపించాలని సవాల్ విసిరారు. ఆ ధరకు దొరికితే అది తప్పకుండా కల్తీ నెయ్యే అవుతుందని అన్నారు. సాధారణంగా మార్కెట్లో కిలో నెయ్యి ధర వెయ్యి రూపాయలకు పైగానే ఉంటుందని తెలిపారు.
Details
ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌తో ఎటువంటి సంబంధం లేదు
ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందాపూర్ డెయిరీని హెరిటేజ్ కో-కంపెనీగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పేర్కొనడం తప్పని విమర్శించారు. అంత సీనియర్ నేతకు "కో-కంపెనీ" అనే పదమే లేదని తెలియదా? అని ప్రశ్నించారు. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్‌కు కో-ప్యాకర్ మాత్రమేనని వివరించారు. హెరిటేజ్ ఒక లిస్టెడ్ కంపెనీ అని గుర్తు చేశారు. తమపై సెబీకి ఫిర్యాదు చేశారని చెప్పినా, ఏమైనా ఆధారాలు సమర్పించారా? నిరూపించారా? అని నిలదీశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో సాక్షి, భారతి సిమెంట్స్ ప్రభుత్వ నుంచి వెయ్యి కోట్ల రూపాయల లబ్ధి పొందాయని ఆరోపించారు. అయితే హెరిటేజ్ మాత్రం ఇన్నేళ్లలో ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పొందలేదని లోకేశ్ స్పష్టం చేశారు.
Details
శాసనమండలి, పార్టీ వ్యవహారాలపై వ్యాఖ్యలు
శాసనమండలి జరగాలని కోరుకునేవారు నాలుగు రోజుల పాటు సభను ఎందుకు అడ్డుకున్నారని లోకేశ్ ప్రశ్నించారు. ఇప్పుడు బడ్జెట్‌పై చర్చ కావాలని వైసీపీ సభ్యులు అడగడం ఎందుకని మండిపడ్డారు. మండలి సమావేశాలను అడ్డుకున్న సమయంలో ఈ విషయం వారికి తెలియదా? అని విమర్శించారు. ఆ సమావేశాల్లో రాజకీయాలపై ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. పార్టీలో జూనియర్లు, సీనియర్ల మధ్య సమన్వయం పూర్తిగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. తనతో పాటు ప్రతి నాయకుడు తమ తమ బూత్‌లలో మెజారిటీ సాధించాలనే లక్ష్యంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అప్పుడు మాత్రమే పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయగలమని అన్నారు.