LOADING...
Chandrababu: 'ఏనాడూ విశ్రాంతి లేను.. ప్రజల భవిష్యత్ కోసం కృషి చేస్తా' : చంద్రబాబు
'ఏనాడూ విశ్రాంతి లేను.. ప్రజల భవిష్యత్ కోసం కృషి చేస్తా' : చంద్రబాబు

Chandrababu: 'ఏనాడూ విశ్రాంతి లేను.. ప్రజల భవిష్యత్ కోసం కృషి చేస్తా' : చంద్రబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇటీవల రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దివ్యాంగురాలు సుమిత్రమ్మకు పింఛన్ డబ్బులు అందించగా, తర్వాత నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమంపై తన లక్ష్యాలను వివరించారు. రాజకీయ జీవితంలో నేను ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు. పిల్లలకు బంగారు భవిష్యత్ అందించాలన్నది నా ఆశయం. ఎవరైనా పింఛను పొందకపోతే, తదుపరి నెలలో అందిస్తామన్నారు. అభివృద్ధి, ఆదాయం పెరుగుదల, ఆర్థిక సంస్కరణల అమలు ముఖ్యమని వివరించారు. రాయలసీమ ఇక రాళ్ల సీమ కాదు, రత్నాల సీమ. పేదల జీవితాల్లో వెలుగులు నింపడం మా లక్ష్యం. సంపద సృష్టి ద్వారా సంక్షేమ పథకాలు సాధ్యమవుతాయి.

Details

ఆదాయం పెరిగితే జీవితాల్లో మార్పు సాధ్యం

అప్పులు చేసిన కుటుంబాల పరిస్థితి త్వరగా సరిచేయబడదు, ఆదాయం పెరిగితేనే జీవితాల్లో మార్పు సాధ్యమని వెల్లడించారు. రాష్ట్ర విభజన తర్వాత ఎదురైన కష్టాలను గుర్తు చేస్తూ, చంద్రబాబు 2014-19 మధ్య చేసిన అభివృద్ధి, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు వచ్చిన స్వేచ్ఛపై గర్వం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. చంద్రబాబు తెలుగు ప్రజల విజ్ఞత, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి, వ్యాపారాల్లో కొనసాగుతున్న ప్రాముఖ్యతను గుర్తు చేశారు. గత పాలకులు అధికారం స్వార్థానికి వాడిన దోపిడి, దివ్యాంగుల పింఛన్లలో అనర్హుల చొరబాట్లను విమర్శించారు. "నిజమైన దివ్యాంగులకు న్యాయం చేస్తాం. రాయలసీమలో గత పాలకులు రక్తం పారించారు, మేము వచ్చాక సాగునీరు అందిస్తున్నాం.

Details

మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తే కఠిన చర్యలు తప్పవు

మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కఠిన చర్యలు తప్పవు అని అన్నారు. రైతుల పరిస్థితి, వ్యవసాయం పెరుగుదలపై కూడా చంద్రబాబు వివరించారు. కష్టాల్లో ఉన్న మామిడి రైతులను మేము ఆదుకున్నాం. మామిడికాయలను రోడ్డుపై పడేసి వైకాపా నేతలు డ్రామాలు ఆడారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేముందు పదిసార్లు ఆలోచించాలి. కడప, రాజంపేట ద్వారా కోడూరు వరకు నీళ్లు అందిస్తాం. రాజంపేటలో వ్యవసాయం తగ్గింది, కానీ ఉద్యానపంటలు, డెయిరీ, పశుసంపద బాగా పెరిగాయన్నారు. చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ విసరారు. "మీరు అసెంబ్లీకి రావడానికి సిద్ధమా? అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? మొన్న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల, వివేకా హత్య, కోడికత్తి డ్రామా, గులకరాయి నాటకాలపై చర్చకు సిద్ధమా?" అని ప్రశ్నించారు.