Arunachal Pradesh: లోహిత్ వ్యాలీలో కార్చిచ్చు.. 9,500 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ఆపరేషన్
ఈ వార్తాకథనం ఏంటి
అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు సంభవించింది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. మంటలను ఆపేందుకు 12,000 లీటర్ల నీటితో MI-17V5 హెలికాప్టర్లు మోహరించారు. అయితే, సుమారు 9,500 అడుగుల ఎత్తులో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడడం సవాలుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు, వైమానిక దళం,అటవీశాఖ అధికారులు కలసి మంటలను అదుపులోకి తీసుకోవడానికి చర్యలు చేపట్టారు.
వివరాలు
నాగాలాండ్,మణిపూర్‌లో కూడా అడవి మంటలు
కార్చిచ్చుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తేలియరాలేదు. మంటల కారణంగా ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంబంధించి ఎటువంటి సమాచారం ప్రస్తుతానికి అందలేదు. ముందస్తు జాగ్రత్త చర్యగా, చుట్టుపక్కల గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలను స్థానిక అధికారులు తాత్కాలిక సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక, నాగాలాండ్‌లోని కోహిమా జిల్లా జుకో లోయ,మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో కూడా అడవి మంటలు విస్తరించాయి. వీటిని అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది చర్యలు చేపట్టారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ట్వీట్
Battling forest fires at nearly 9,500 feet in Arunachal Pradesh’s Lohit Valley. #IAF Mi-17V5 helicopters dropped 12,000 litres of water in the rarefied Himalayan air, showcasing exceptional courage, precision and a commitment towards protecting lives and fragile ecosystems.… pic.twitter.com/5SXBm7M5he
— Indian Air Force (@IAF_MCC) January 29, 2026