LOADING...
ICAI CA Inter Results 2025: సీఏ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు 
సీఏ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు

ICAI CA Inter Results 2025: సీఏ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 04, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ICAI) సీఏ ఇంటర్‌,ఫౌండేషన్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ICAI మంగళవారం ప్రకటించింది. విద్యార్థులు తమ రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి, https://icai.nic.in/ వెబ్‌సైట్‌లో స్కోరు కార్డులు, మెరిట్‌ జాబితాను పొందవచ్చు. సీఏ ఇంటర్‌ (ICAI CA Inter Results 2025) ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన దీపాన్షి అగర్వాల్‌ 86.63% మార్కులతో ప్రథమ ర్యాంకును సాధించింది. విజయవాడకు చెందిన తోట సోమనాథ్‌ శేషాద్రి నాయుడు 86% మార్కులతో రెండో ర్యాంక్‌ పొందాడు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌కు చెందిన సర్థాక్‌ అగర్వాల్‌ 85.83% స్కోరుతో మూడో ర్యాంకులో నిలిచాడు.

వివరాలు 

సీఏ ఇంటర్‌ గ్రూప్‌ 1 పరీక్షలో 14.17% ఉత్తీర్ణత

సీఏ ఇంటర్‌ గ్రూప్‌ 1 పరీక్షలో 14.17% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 1,08,187 మంది పరీక్ష రాయగా, 15,332 మంది విజయం సాధించారు. గ్రూప్‌ 2 పరీక్షలో 22.16% ఉత్తీర్ణత నమోదు కాగా, రెండు గ్రూప్‌ల విభాగంలో 14.05% మంది పాస్‌ అయ్యారు. ఫౌండేషన్‌ పరీక్ష ఫలితాల్లో 21.52% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్‌ కోర్సులో గ్రూప్‌ 1 పరీక్షలు జనవరి 11, 13, 15 తేదీల్లో, గ్రూప్‌ 2 పరీక్షలు జనవరి 17, 19, 21 తేదీల్లో నిర్వహించబడాయి. రెండు గ్రూప్‌లకు చెందిన అభ్యర్థుల పరీక్షలు జనవరి 12, 14, 16, 18 తేదీల్లో జరిగాయి.