Page Loader
పౌష్టికాహార పంటల ఉత్పత్తిపై ఇక్రిసాట్‌ స్పెషల్ ఫోకస్
పౌష్టికాహార పంటల ఉత్పత్తిపై ఇక్రిసాట్‌ స్పెషల్ ఫోకస్

పౌష్టికాహార పంటల ఉత్పత్తిపై ఇక్రిసాట్‌ స్పెషల్ ఫోకస్

వ్రాసిన వారు Stalin
May 12, 2023
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రజావసరాలకు అనుగూనంగా హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ అడుగులు వేస్తోంది. పెరుగుతున్న జనాభాకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడంపై ఇక్రిశాట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా అధిక పోషల విలువలు ఉండే పంటలను ఉత్పత్తి చేయడంలో ఉండే అవాంతరాలను ఎదుర్కొనేలా ఇతర సంస్థలతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది. పోషకాలు మెండుగా ఉండే ఆహార పదార్థాలను తయారు చేసే ప్రక్రియలో భాగంగా ముంబైకి చెందిన గుడ్ ఫుడ్ ఇనిస్టిట్యూట్ పరిశోధన సంస్థకు ఇక్రిశాట్-హైదరబాదాద్ సాయం చేయనుంది.

హైదరాబాద్

టెక్నాలజీ, సాగు విధానాలపై ఇక్రిశాట్ అవగాహన 

గుడ్ ఫుడ్ ఇనిస్టిట్యూట్ పరిశోధన సంస్థతో కలిసి పని చేసే క్రమంలో ఇక్రిశాట్-హైదరబాదాద్ అందుబాటులో ఉన్న టెక్నాలజీ, సాగు విధానాలపై అవగాహన కల్పించనుంది. ఉమ్మడి పరిశోధనలు మెరుగైన ఫలితాలు వస్తాయని ఇక్రిశాట్ నమ్ముతోంది. తద్వారా పోషకాహార లోపాన్ని అధిగమించి, ఉత్తమమైన పంటలు ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో పౌష్టికాహార ఉత్పత్తులపై నేషనల్ లెవల్‌లో అవగాహన కల్పించడానికి గుడ్ ఫుడ్ ఇనిస్టిట్యూట్ స్మార్ట్ ప్రోటిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్మార్ట్ ప్రోటిన్ కార్యక్రమంలో భాగంగానే ఇక్రిశాట్‌తో పాటు మరికొన్ని సంస్థలతో గుడ్ ఫుడ్ ఇనిస్టిట్యూట్ పని చేయనుంది.