Page Loader
Siddiqui's case: 'కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ'.. నిందితుడి కీలక వ్యాఖ్యలు
కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ'.. నిందితుడి కీలక వ్యాఖ్యలు

Siddiqui's case: 'కుదిరితే బాబా సిద్ధిఖీ.. లేకుంటే జీషన్ సిద్ధిఖీ'.. నిందితుడి కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఆదివారం ఉత్తరప్రదేశ్‌ బహ్రైచ్‌లో జరిగిన అరెస్టులో, నలుగురు సహాయకులతో సహా ప్రధాన నిందితుడు శివకుమార్‌ను పోలీసులు పట్టుకున్నారు. శివకుమార్, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌తో సన్నిహితంగా ఉన్నట్లు పోలీసులకు తెలిపారు. ఇంతలో అన్మోల్ బిష్ణోయ్ బాబా సిద్ధిఖీని చంపడంలో పలు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు శివకుమార్ వెల్లడించాడు. ముందుగా ఎవరిని చూసినా కాల్చేయండి' అని అన్మోల్ శివకుమార్‌కు చెప్పాడని పోలీసులు చెప్పారు. హత్య జరిగిన తర్వాత, ప్రధాన నిందితుడు శివకుమార్ వెంటనే పారిపోయాడు.

Details

దేశం విడిచి పారిపోయేందుకు ప్లాన్

శివకుమార్ హత్య తర్వాత బట్టలు మార్చుకుని కుర్లా, థానే, పూణె, ఝాన్సీ, లక్నో ఇలా తన మార్గాన్ని మార్చుకున్నట్లు పోలీసులు వివరించారు. తర్వాత ఆయన్ని బహ్రైచ్‌లో పట్టుకున్న పోలీసులు, అతను దేశం విడిచి పారిపోవడానికి ముందుగా మధ్యప్రదేశ్‌, జమ్మూకు వెళ్లేందుకు ప్లాన్ చేశారని చెప్పారు. అక్టోబరు 12న సిద్ధిఖీ హత్యలో భాగమైన శివకుమార్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అయితే హర్యానా వ్యక్తి గుర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ కశ్యప్‌లను కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.