Pregnancy Scam : గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు.. ఎక్కడంటే?
మహిళను గర్భవతిని చేస్తే డబ్బులు ఇస్తారంట? లక్షో రెండో లక్షలు కాదు? ఏకంగా రూ. 13 లక్షలు ఇస్తున్నారంట. ఇది ఉందంతం ఎక్కడో జరుగుతోందో తెలుసా? బిహార్ లో. జాబ్ లేని నిరుద్యోగులకు అక్కడ ఇలాంటి జాబ్స్ ఇచ్చి లక్షల్లో జీతాలు ఇస్తున్నారంట. ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ పేరుతో ఓ ఏజెన్సీ యువకులకు గాలం వేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని నవాడాలో గర్భం దాల్చలేని మహిళలను గర్భం దాల్చేందుకు ఓ ఏజెన్సీని నడుపుతున్నారు. మహిళలను గర్భం దాల్చడం కోసం పురుషులకు రూ.13 లక్షలు, ఒకవేళ ప్రయత్నించి కూడా గర్భం రాకపోతే రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థుల తొలుత రూ.799తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
చట్ట విరుద్ధమన్న పోలీసులు
మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి అమ్మాయిల ఫోటోలను పంపుతారు. తర్వాత బాధితుడి నుంచి రూ.5 వేల నుంచి రూ.20వేల వరకు చెల్లించాలని ఈ ఏజెన్సీ కోరుతుంది. ఇక మహిళల అందాన్ని బట్టి ఈ సెక్యూరిటీ డిపాజిట్ పెరుగుతుందని చెప్పుకొచ్చారు. చివరి ఇదోక ఫేక్ ఏజెన్సీ తాము మోసపోయామని బాధితులు సైలెంట్ గా ఉండిపోయారు. అయితే ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఈ విషయాలను బయటికి తీసుకొచ్చారు. ఈ స్కాం వెనకాల మున్నా కుమార్ అనే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.అయితే అతను పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఇందులో భాగమైన 8మందిని అరెస్టు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని, దీనిపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.