LOADING...
S Jaishankar: 'భారత్‌తో సమస్య ఉంటే.. మా ఉత్పత్తులను కొనకండి'.. అమెరికాకు జైశంకర్‌ వార్నింగ్!
'భారత్‌తో సమస్య ఉంటే.. మా ఉత్పత్తులను కొనకండి'.. అమెరికాకు జైశంకర్‌ వార్నింగ్!

S Jaishankar: 'భారత్‌తో సమస్య ఉంటే.. మా ఉత్పత్తులను కొనకండి'.. అమెరికాకు జైశంకర్‌ వార్నింగ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2025
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై అదనపు టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ స్పందిస్తూ దేశ ప్రజల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. భారత్‌తో ఎవరికైనా సమస్య ఉంటే, ఇక్కడి ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టమైన సందేశం ఇచ్చారు. శనివారం దిల్లీలో ఎకనామిక్‌ టైమ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన 'వరల్డ్‌ లీడర్స్‌ ఫోరం' సదస్సులో పాల్గొన్న జైశంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు దిగుమతులపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఆయన భారత్‌-అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. కానీ మాకు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలున్నాయి.

Details

కొన్ని దేశాలు ఇతరులపై నిందలు మోపడం హాస్యాస్పదం

వాటిని కాపాడుకోవడం మా బాధ్యత. రైతులు, చిన్న ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించడమే మాకు ముఖ్యం. దీనిపై రాజీకి అవకాశమే లేదు. అమెరికా యంత్రాంగానికి అనుకూలంగా నడుచుకుంటూ కొన్ని దేశాలు ఇతరులపై నిందలు మోపడం హాస్యాస్పదం. నిజంగా మీకు భారత్‌తో సమస్య ఉంటే, మా చమురును లేదా శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనకండి. ఎవ్వరూ కొనాలని బలవంతం చేయడం లేదని వ్యాఖ్యానించారు. అలాగే ట్రంప్‌ అదనపు సుంకాలు విధించడానికి ముందు రష్యా చమురు అంశంపై అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపారు. ప్రపంచ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్కో నుంచి చమురును కొనుగోలు చేస్తున్నామని విదేశాంగమంత్రి వివరించారు. 2022లో చమురు ధరలు ఆకాశాన్నంటాయి. అప్పట్లో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది.

Details

సంప్రదాయ పద్ధతులకంటే భిన్నంగా ఉంది

అప్పుడు భారత్‌ రష్యా చమురు కొనుగోలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదని ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే దానివల్లే ధరలు స్థిరీకరించబడ్డాయని జైశంకర్‌ గుర్తుచేశారు. మాస్కోతో వాణిజ్యాన్ని విస్తరించాలని భారత్‌ కోరుకుంటుందని చెప్పారు. అయితే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై భారత్‌ వైఖరి స్పష్టమని, ఉద్రిక్తతలు త్వరగా తగ్గిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్‌ విదేశాంగ విధానం గురించి జైశంకర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత అమెరికా అధ్యక్షుడిలా విదేశాంగ విధానాన్ని ఇంత బహిరంగంగా అమలు చేసిన అధ్యక్షుడిని గతంలో చూడలేదు. ఇది ఒక్కభారత్‌ విషయంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో ఆయన వ్యవహరిస్తున్న తీరు సంప్రదాయ పద్ధతులకంటే భిన్నంగా ఉంది. వాణిజ్య అంశాలతో పాటు వాణిజ్యేతర వ్యవహారాలకూ టారిఫ్‌లను వినియోగించడం పూర్తిగా కొత్తవిధానమని జైశంకర్‌ వ్యాఖ్యానించారు.