LOADING...
Uddhav Thackeray: పార్టీని వీడాలనుకుంటే నిర్ణయం మీదే : ఉద్ధవ్‌ ఠాక్రే
పార్టీని వీడాలనుకుంటే నిర్ణయం మీదే : ఉద్ధవ్‌ ఠాక్రే

Uddhav Thackeray: పార్టీని వీడాలనుకుంటే నిర్ణయం మీదే : ఉద్ధవ్‌ ఠాక్రే

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2026
05:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

శివసేన (UBT) ఎంపీలు శిందే వర్గంలో చేరనున్నారని వస్తున్న వార్తలపై పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) స్పందించారు. పార్టీని వీడాలనుకునేవారు వెళ్లిపోవచ్చని, ఈ విషయంలో ఎవరికీ అడ్డంకులు లేవని, పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన స్పష్టం చేశారు. 2022లో జరిగిన శివసేన చీలికను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాలుగేళ్ల క్రితం పార్టీలో పెద్ద విభజన జరిగిందని, అప్పట్లో సుమారు 40 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారని గుర్తుచేశారు. అయితే ఎవరినీ బలవంతంగా పార్టీలో ఉండమని తాను ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని ఉద్ధవ్ పేర్కొన్నారు.

వివరాలు

ఓర్పుతో ముందుకు సాగాలి

పార్టీని వీడి వెళ్లిన వారు ఎప్పటికైనా తమ నిర్ణయంపై పశ్చాత్తాపపడతారని ఆయన వ్యాఖ్యానించారు. కానీ అప్పటికి సమయం మించిపోయి ఉంటుందని కూడా అన్నారు. ప్రస్తుతం సమయం తన పక్షంలో లేకపోయినా, భవిష్యత్తులో తప్పకుండా తనదే అవుతుందని, అప్పటివరకు ఓర్పుతో ముందుకు సాగుతానని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా 'ఆపరేషన్ టైగర్' పేరుతో ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గం, ఠాక్రే వర్గంలోని ఎంపీలను తమ వైపుకు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను పార్టీ ఎంపీ Sanjay Raut తీవ్రంగా ఖండించారు. శివసేన (UBT) ఎంపీలు పార్టీని వీడుతున్నారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement