
NEET: 2024లో అవకతవకలపై CBI విచారణకు IMA డిమాండ్
ఈ వార్తాకథనం ఏంటి
IMA జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ NEET 2024లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణను కోరింది.
విద్యార్థులందరికీ న్యాయమైన , పారదర్శక మూల్యాంకన ప్రక్రియను నిర్ధారించాలని వైద్యుల సంఘం కోరింది.
తప్పకుండా పునఃపరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేసింది. IMA జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ NTAకి రాసిన లేఖలో ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో గమనించిన అక్రమాలు వ్యత్యాసాలను ప్రస్తావించింది.
గణాంకాలపై అనుమానం కొందరు విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారని, ఇది గణాంకపరంగా సందేహాస్పదంగా వుందని లేఖలో పేర్కొన్నారు.
ఈ విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల కోసం నిర్వచించిన పరీక్ష అర్ధం లేదని ఆ లేఖలో ప్రస్తావించారు.
Details
చాలా చోట్ల పేపర్ లీక్
విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల ప్రకారం ఎలాంటి జాబితాను పంచుకోలేదని వారు NEET దృష్టికి తీసుకువచ్చారు.
ఇంకా, నీట్ 2024 పేపర్ చాలా చోట్ల లీక్ అయిందని, అయితే ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని వైద్యుల సంఘం ప్రశ్నించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
CBI విచారణకు IMA డిమాండ్
IMA Junior Doctors Network demand a CBI inquiry into the alleged irregularities in the NEET 2024; also requests a re-examination "to ensure a fair and transparent evaluation process for all the students" pic.twitter.com/f4FHvXdMce
— ANI (@ANI) June 8, 2024