LOADING...
World record: మండల ఆర్ట్‌తో వేంకటేశ్వరుడి చిత్రం.. ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు 
మండల ఆర్ట్‌తో వేంకటేశ్వరుడి చిత్రం.. ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు

World record: మండల ఆర్ట్‌తో వేంకటేశ్వరుడి చిత్రం.. ఒకేసారి 54 ప్రపంచ రికార్డులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2024
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

మండల ఆర్ట్ సాంకేతికతతో వేంకటేశ్వరుడి చిత్రాన్ని తీర్చిదిద్దడం ద్వారా 54 ప్రపంచ రికార్డులను సోనాలి ఆచార్జీ సొంతం చేసుకున్నారు. శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేషనల్, ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ ఆర్గనైజేషన్స్ సెంట్రల్ కోఆర్డినేటర్ లయన్ డా. కేవీ రమణారావు, ముఖ్య అతిథి డా. సముద్రాల వేణుగోపాలచారి హజరై ఆమెకు ఈ సర్టిఫికేట్లను అందజేశారు. ఒకే చిత్రానికి ఇన్ని రికార్డులు పొందడం నిజంగా అభినందనీయమని వేణుగోపాలచారి చెప్పారు.

Details

గతంలో కూడా హిమజకు 50 రికార్డులు

సోనాలి 54 గంటల్లో 9.3 అడుగుల పొడవు, 7.3 అడుగుల వెడల్పుతో వెంకటేశ్వరుడిని మండల ఆర్ట్‌తో తయారుచేసిన తొలిసారి కావడం రమణారావు విశేషమన్నారు. గతంలో చిరంజీవి జీవితంపై చిన్న పుస్తకం రూపొందించిన హిమజకు 50 రికార్డులొచ్చాయని చెప్పారు. సోనాలి ఆచార్జీ తన బాల్యంలో ఒడిస్సి నృత్యకారిణిగా అనుభవం ఉన్నాయని, మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో వైద్యులు నృత్యం ఆపాలని సూచించారు. ఆమె పిల్లనుంచి తెలిసిన చిత్రలేఖనాన్ని మళ్లీ ప్రారంభించానని చెప్పారు. సినీ నటుడు శ్రీనివాస్ పసునూరి, విశ్రాంత ఐఏఎస్ అధికారి సబ్రహ్మణ్యం హజరయ్యారు.