Page Loader
తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు 
తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు

తెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు 

వ్రాసిన వారు Stalin
May 29, 2023
06:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, లక్డీకాపూల్, ఎల్‌బీ నగర్, అంబర్‌పేట్, ఓయూ తదితర ప్రాంతాల్లో సోమవారం ఉదయం తెల్లవారుజామున ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా సోమవారం నుంచి మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది.

తెలంగాణ

ఎల్లో అలర్ట్‌ను జారీ చేసిన ఐఎండీ 

ఇదిలా ఉంటే ఉపరిత ఆవర్తన కారణంగా సోమవారం నుంచి మంగళవారం మధ్య ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి, మెదక్‌లలో వర్షాలు పడే అవకాశం ఉంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నల్గొండ, భదాద్రి కొత్తగూడం, ములుగు, యాదాద్రి, మేడ్చల్‌, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, సిద్దిపేటలో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అయితే మంగళవారం సాయంత్రానికి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.