Page Loader
Weather Update: తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

Weather Update: తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
05:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ గంగా తీరప్రాంతం వరకు నైరుతి దిశలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ వాతావరణం ఏర్పడిందని వివరించింది. ఈ అల్పపీడనం సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనంగా విస్తరించి ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వంగి ఉన్నట్లు స్పష్టం చేసింది.

Details

 వర్షాలు పడే జిల్లాల వివరాలివే 

మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో **ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. బుధవారం మంగళవారం జిల్లాలకు అదనంగా మహబూబాబాద్‌ జిల్లా కూడా వర్షాల ప్రభావంలోకి రానుంది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి. శుక్రవారం ఇప్పటికే పేర్కొన్న జిల్లాలతో పాటు వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి జిల్లాలు కూడా వర్షాల ప్రభావానికి లోనవుతాయి.

Details

 పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ

శనివారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ కూడా జారీ చేసినట్లు తెలిపింది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.