NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
    తెలంగాణకు రెయిన్ అలర్ట్..

    Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 10, 2024
    08:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలకమైన సమాచారం వెల్లడించారు.

    నేడు,రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమంగా బలపడుతోంది.

    ఈ ద్రోణి ప్రభావం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మరింత రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

    నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

    కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

    నేడు ఆదిలాబాద్,ఆసిఫాబాద్,యాదాద్రి,మహబూబాబాద్,నల్లగొండ,సూర్యాపేట,ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్,నారాయణపేట,మహబూబ్‌నగర్,వనపర్తి,జోగులాంబ గద్వాల,వికారాబాద్ జిల్లాల్లో వర్షాలకు అవకాశముందని పేర్కొన్నారు.

    ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు.

    వివరాలు 

    నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు

    భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని చెప్పారు. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

    ఈ నేపథ్యంలో పొలం పనులకు, బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

    గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపారు.

    నేడు హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉండబోతుందని చెప్పారు. ఉదయం కాస్త ఎండ ఉండే సందర్భంలో, సాయంత్రానికి మేఘాలు కమ్ముకొని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

    ఈ నేపథ్యంలో నగర ప్రజలకు జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    వివరాలు 

    రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ 

    ద్రోణి ప్రభావంతో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

    ఏపీలో నేడు కర్నూలు, నంద్యాల, అనంతపురం, అల్లూరి, ఎన్టీఆర్, ప్రకాశం, శ్రీసత్యసాయి, YSR కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

    ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    వాతావరణ శాఖ

    తాజా

    shreyas iyer: పంజాబ్ జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన తీరు అద్భుతం : సురేష్ రైనా శ్రేయస్ అయ్యర్
    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార

    తెలంగాణ

    Hydra: మాదాపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ కూల్చివేత  హైదరాబాద్
    Heavy Rain Alert: తెలంగాణలో మరో మూడురోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ చేసిన ఐఎండీ ఐఎండీ
    Telangana: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ ఐఎండీ
    Telangana: రైతులకు రేవంత్ ప్రభుత్వం తీపి కబురు.. సన్నాల వడ్లకు బోనస్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డి

    వాతావరణ శాఖ

    Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి భారీ వర్షాలు  భారతదేశం
    Heavy rains: అలర్ట్.. తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణ
    Monsoon: రైతులకు వాతావరణ విభాగం బ్యాడ్ న్యూస్.. సెప్టెంబర్‌ నెలాఖరు వరకు వర్షాలు   వాతావరణ మార్పులు
    AP Rains: అలర్ట్.. రానున్న మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025