వాతావరణ మార్పులతో వలస పక్షుల మనుగడ ప్రశ్నార్థకం
వలస పక్షుల మనుగడపై వాతావరణ మార్పులు ఎక్కువగా ప్రభావం చూపనున్నాయని పరిశోధకులు ధ్రువీకరించారు. ఇవి పరిమాణంలో పెద్దగా ఉండే వివాంగాహలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. 1970 నుంచి 2019 వరకు అన్ని ఖండాల్లోని 104 పక్షులపై శాస్త్రవేత్తలు ఓ అధ్యాయనాన్ని నిర్వహించారు. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా పెద్ద పక్షులు, వలస విహంగాల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతున్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మారుతున్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా వలస పక్షులు తమ శరీర ఆకృతిని మలుచుకోకపోవడమే దీనికి కారణమని చెప్పొచ్చు.
చిన్న పరిమాణంలో ఉండే పక్షుల్లో సంతాన సాఫ్యలత పెరిగే అవకాశం
శీతాకాలం విడిది కోసం సైబీరియా, నైజీరియా, రష్యా, టర్కీ, యూరప్ దేశాల నుంచి వలస పక్షులు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ విస్తరించిన కొల్లేరు ప్రాంతానికి ప్రతి ఏటా చేరుకుంటాయి. ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రానికి పెలికాన్ పక్షులు వేలాదిగా రావడంతో దీనికి పెలికాన్ ప్యారడైజ్ గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. అయితే చిన్న పరిమాణంలో ఉండే పక్షులు, స్థిరంగా ఒకచోట విహంగాల్లో మాత్రం సంతాన సాఫల్యత పెరిగినట్లు పరిశోధకులు గుర్తించడం విశేషం