Hyderabad: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ అమలు.. 9,292 ఎకరాల ఇండస్ట్రీ ల్యాండ్స్‌కు మల్టీ-యూస్ గ్రీన్ సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీకి ఆమోదం తెలుపుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) లోపల, పరిసర ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చుకునే అవకాశం లభించింది. ముఖ్యంగా, నగర హృదయంలో కాలుష్యాన్ని సృష్టిస్తున్న, పాత టెక్నాలజీతో నడుస్తున్న పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించేందుకు ఈ పాలసీ పునాది వేసింది. హిల్ట్ పాలసీ కింద మొత్తం 22 ఇండస్ట్రియల్ ఏరియాలలో ఉన్న 9,292 ఎకరాల భూములను ఇతర అవసరాలకు ఉపయోగించే వీలుంటుంది.
Details
ప్లాట్లపై 50 శాతం ఫీజు చెల్లించాలి
వీటిలో 4,740 ఎకరాలు ఇప్పటికే ప్లాటెడ్ ల్యాండ్స్‌గా అభివృద్ధి చెందినవి. వన్-టైమ్ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు (డీఐఎఫ్) చెల్లింపు విధానాన్ని కూడా ప్రభుత్వం స్పష్టంచేసింది. 80 ఫీట్లలోపు రోడ్లకు ఎదురుగా ఉన్న ప్లాట్లపై సబ్ రిజిస్ట్రార్ విలువలో 30 శాతం ఇంపాక్ట్ ఫీజు విధించగా 80 అడుగులు లేదా అంతకంటే పెద్ద రోడ్లను ఎదుర్కొంటున్న ప్లాట్లపై 50 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. TG-IPASS ద్వారా దరఖాస్తు చేసుకునే సమయంలో దరఖాస్తుదారు ముందస్తుగా 20 శాతం చెల్లించాలి. మిగిలిన 80 శాతం రెండు వాయిదాలలో 45 రోజుల్లోపు పూర్తి చేయాలి. ఒక నెల గ్రేస్ పీరియడ్ తర్వాత నెలకు 1 శాతం జరిమానా వర్తిస్తుంది.
Details
ప్రాథమిక పరిశీలన 7 రోజుల్లో పూర్తి
ఆ తరువాత రుసుము జప్తు చేయబడుతుంది. దరఖాస్తు అనర్హమవుతుంది. TGIIIC/IALA శాఖలు దరఖాస్తుల ప్రాథమిక పరిశీలనను 7 రోజుల్లో పూర్తి చేస్తాయి. తదుపరి 7 రోజుల్లో తుది ఆమోదం జారీలోకి వస్తుంది. దరఖాస్తులు సమర్పించడానికి ప్రభుత్వం ఆరు నెలల గడువును నిర్దేశించింది. లేఅవుట్ మార్పులు, దరఖాస్తుల ప్రాసెసింగ్‌లను పర్యవేక్షించడానికి TGIIICను నోడల్ ఏజెన్సీగా నియమించారు. గతంలో పరిశ్రమల కోసం కేటాయించిన భూములు, నగర విస్తరణతో ఇప్పుడు కీలక ప్రాంతాలుగా మారాయి.
Details
కాలుష్యానికి కారణం
సిటీ అభివృద్ధి చెందడంతో అప్పట్లో ఏర్పాటు చేసిన పరిశ్రమలు ప్రస్తుతం కాలుష్య సమస్యలకు కారణమయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలించాలనే ప్రభుత్వ నిర్ణయం ముందే వెల్లడైంది. ఆ భూములను ఇతర ప్రయోజనాల కోసం వినియోగించాలని యోచించిన ప్రభుత్వం, హిల్ట్ పాలసీ అమలుతో ఆ దిశగా స్పష్టమైన చర్యలు ప్రారంభించింది.