TTD: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం.. రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్లుగా అమలులో ఉన్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్వహణలో మార్పు తెస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల తిరుమల పర్యటన పూర్తి చేసిన వెంటనే ఈ ఉత్తర్వులు వెలువడడం విశేషం. రివర్స్ టెండరింగ్ విధానం తొలగింపుపై అధికారికంగా వివరణ ఇవ్వలేదు. ఈ మార్పు టీటీడీ భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.