Blinkit's Condom order: వీడు మామూలోడు కాదు.. 2023లో ఏకంగా 10వేల కండోమ్‌లు వాడేశాడు
ఈ వార్తాకథనం ఏంటి
2023 ఏడాదికి మరి కొన్ని గంటల్లో ముగింపు వీడ్కోలు పలకబోతున్నాం.
ఈ క్రమంలో ఈ ఏడాది (జొమాటో)Zomato యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ 'బ్లింకిట్ (Blinkit)'కు వచ్చిన టాప్ ఆర్డర్ల వివరాలను కంపెనీ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా వెల్లడించారు.
ఇందులో ఆశ్చర్యకర విషయాలను వెలుగులోకి వచ్చాయి.
ఓ వ్యక్తి 2023లో ఏకంగా 10వేల కండోమ్‌లను ఆర్డర్ ఇచ్చినట్లు అల్బిందర్ ధిండ్సా చెప్పారు.
దక్షిణ దిల్లీకి చెందిన వినియోగదారుడు 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేసాడట.
అలాగే ఒక్క గురుగ్రామ్ నుంచే 65,973 లైటర్‌లను ఆర్డర్ చేసినట్లు కంపెనీ తన నివేదికలో వెల్లడించింది.
అలాగే శీతల పానీయాల కంటే ఎక్కువ టానిక్ వాటర్‌లను (కార్బోనేటేడ్ డ్రింక్స్) ఆర్డర్ చేసింది కూడా గురుగ్రామ్ నుంచే అని చెప్పింది.
దిల్లీ
అర్ధరాత్రి దాటిన తర్వాత 3కోట్లకు పైగా మ్యాగీ ప్యాకెట్ల డెలివరీ
ఈ సంవత్సరం దాదాపు 30,02,080 పార్టీస్మార్ట్ టాబ్లెట్ల(మద్యం తాగిన తర్వాత ఉదయం హ్యాంగోవర్‌ను నివారించడానికి)ను ఆర్డర్ చేసినట్లు కంపెనీ వివరించింది.
అర్థరాత్రి దాటిన తర్వాత అనేక మంది మ్యాగీ తినాలని అనకున్నారట. 2023లో అర్ధరాత్రి దాటిన తర్వాత 3,20,04,725 మ్యాగీ ప్యాకెట్లను బ్లింకిట్ డెలివరీ చేసింది.
ఒక వినియోగదారు ఒక ఆర్డర్‌లో ఏకంగా 101 లీటర్ల మినరల్ వాటర్‌ను కొనుగోలు చేశాడు.
ఈ ఏడాది 80,267 గంగాజల్ బాటిళ్లను బ్లింకిట్ డెలివరీ చేసింది.
ఒకరు ఏకంగా 4,832 స్నానపు సబ్బులను కొనుగోలు చేశాడట.
హైదరాబాద్‌కు చెందిన ఒకరు 2023లో 17,009 కిలోల బియ్యాన్ని ఆర్డర్ చేశాడు.