ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి
ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజాన్ అహ్మద్ మృతిపై విచారణకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఫైజాన్ అహ్మద్ శరీరంపై గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలడంతో ఈ కేసులో అనుమానితులకు నార్కో టెస్టు చేసేందుకు కోర్టు అనుమతించింది. రెండోసారి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో బయటపడిన నివేదికల ఆధారంగా నార్కో టెస్టు చేసేందుకు కోర్టు అనుమతి అనుమతి ఇచ్చింది. మొదటిసారి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఫైజాన్ అహ్మద్ మృతి అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రెండోసారి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని వెలికితీశారు.
ఫైజాన్ అహ్మద్ ఆత్మహత్య కాదు, హత్య చేశారు: కుటుంబ సభ్యులు
మృతదేహాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసుల బృందం కోల్‌కతాకు తీసుకెళ్లింది. అక్కడ కోర్టు నియమించిన నిపుణుడితో రెండో శవపరీక్ష నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 14న క్యాంపస్ ఆవరణలోని హాస్టల్ గదిలో ఫైజాన్ అహ్మద్ శవమై కనిపించాడు. ఇది ఆత్మహత్యేనని కళాశాల అధికారులు చెప్పగా, కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేశారని ఆరోపించారు. ర్యాగింగ్ వల్లే అతను చనిపోయాడని, ఐఐటీ-ఖరగ్‌పూర్ యాజమాన్యం అతని ఫిర్యాదులను పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫైజాన్ అహ్మద్‌ది కచ్చితంగా హత్యేనని వారు చెప్పారు.