Page Loader
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌.. ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? 
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌.. ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా?

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌.. ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? 

వ్రాసిన వారు Stalin
Dec 02, 2023
08:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోకొద్ది గంటల్లో వెలువడనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల్లో గెలుపోటములపై ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేలకోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మొత్తం రూ.1400కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. భీమవరం, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వందలాది మంది భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాల్లో ఎన్నికల ఫలితాలపై భారీగా పెట్టింగ్ కాశారట. అంతేకాదు, బెట్టింగ్ రాయుళ్ల కోస అక్కడ ప్రత్యేక వసతిని కూడా కల్పించారట. పోలింగ్‌కు ఏపీలో రూ.400కోట్ల బెట్టింగ్ జరిగిందని, ఎగ్జిట్ పోల్స్ వచ్చాక పందెం రాయుళ్లు మరో రూ.1000కోట్ల పెందెం కాశారని 'సత్తా బజార్' అనే సర్వే సంస్థ అంచనా వేసింది.

బెట్టింగ్

తుపాన్‌పై కూడా బెట్టింగ్ కాస్తారట

వాస్తవానికి భీమవరంతో పాటు కోస్తాంధ్రలో ప్రత్యేక బెట్టింగ్ మార్కెంట్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి ప్రతి ఏటా ఎన్నికల నుంచి ఐపీఎల్ వరకు భారీ స్థాయిలో బెట్టింగ్ కాస్తారు. ఆఖరికి తుపానులపై కూడా ఇక్కడ బెట్టింగ్ కాస్తారట. ఇక్కడ బెట్టింగ్‌లో పాల్గొనేందుకు ఏపీకి భూస్వాములు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం నుంచే ఎక్కువ మంది బెట్టింగ్ రాయుళ్లు ఉంటారని టాక్. ఇటీవల జరిగిన క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా భీమవరం, డెల్టా ప్రాంతాల్లో బెట్టింగ్ టర్నోవర్ రూ. 1500 కోట్ల-రూ.2000 కోట్ల ఉంటుందని అంచనా. ఇప్పుడు తెలంగాణ ఫలితాలపై మొత్తం కలిపి రూ.1400కోట్ల పెందెం నడుస్తున్నట్లు టాక్.

తెలంగాణ

ప్రధాన పార్టీల అభ్యర్థులపై రూ.వందల కోట్లలో పందెం

ఈ బెట్టింగ్ కూడా పార్టీల గెలుపు, ఓటములపైనే కాకుండా వివిధ అంశాలపై కూడా బెట్టింగ్ కాస్తారట. కాంగ్రెస్‌కు 67 నుండి 82 సీట్లు వస్తాయని, ప్రధాన పార్టీల్లోని కీలక నేతల గెలుపోటములు, బీఆర్ఎస్ బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా, ఎవరు సీఎం అవుతారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, హంగ్ అసెంబ్లీ అవకాశాలపై కూడా బెట్టింగ్ నడుస్తున్నట్లు వినికిడి. కామారెడ్డి, కొడంగల్‌ నుంచి రేవంత్‌రెడ్డి(కాంగ్రెస్‌), గజ్వేల్‌ నుంచి కేసీఆర్‌, సిరిసిల్ల నుంచి కేటీఆర్‌, సిద్ధిపేట నుంచి హరీశ్‌రావు, దుబ్బాక(రఘునందన్‌రావు), హుజూరాబాద్‌ (ఈటెల రాజేందర్‌), కరీంనగర్ (బండి సంజయ్), శేరిలింగంపల్లి, ఉప్పల్, మల్కాజిగిరి, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, కరీంనగర్ వంటి కీలక నియోజకవర్గాలపై రూ.వందల కోట్లలో బెట్టింగ్ జరిగినట్లు సమాచారం.