Page Loader
Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు
Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు

Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2024
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

జింక్‌ తింటే బాడీ బిల్టింగ్‌ చేయొచ్చనే ఆలోచనలతో ఓ యువకుడు ఏకంగా కాయిన్స్‌, మ్యాగ్నెట్స్‌ తిన్నాడు. 20 రోజులుగా వాంతులు, కడుపునొప్పి ఎక్కువవడంతో అతడికి టెస్టులు చేయగా అతడి పొట్టలో భారీ సంఖ్యలో కాయిన్లు, మ్యాగ్నెట్‌లు ఉన్నట్లు బయటపడింది. దీంతో అతడిని దేశ రాజధాని దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. కాయిన్లు, మ్యాగ్నెట్‌లు పొట్టలో ఉండడంతో ఆ వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేసి అతడి కడుపు నుండి ప్రేగు నుండి ఏకంగా 39 కాయిన్లు(1,2,5 రూపాయల నాణాలు), 37 అయస్కాంతాలను బయటికి తీశారు. వారం రోజుల పాటు రోగిని అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు అతడిని ఆ తరువాత డిశ్చార్జ్ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పొట్టలో భారీ సంఖ్యలో కాయిన్లు, మ్యాగ్నెట్‌లు