Page Loader
Delhi: గ్యాంగ్‌స్టర్‌తో 'రివాల్వర్ రాణి' పెళ్లి.. రౌడీ జంట వివాహానికి భారీ భద్రత
Delhi: గ్యాంగ్‌స్టర్‌తో 'రివాల్వర్ రాణి' పెళ్లి.. రౌడీ జంట వివాహానికి భారీ భద్రత

Delhi: గ్యాంగ్‌స్టర్‌తో 'రివాల్వర్ రాణి' పెళ్లి.. రౌడీ జంట వివాహానికి భారీ భద్రత

వ్రాసిన వారు Stalin
Mar 12, 2024
05:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ద్వారకా సెక్టార్-3లో మంగళవారం ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల వివాహం ఘనంగా జరిగింది. దిల్లీలో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ కాలా జాతేడి, రివాల్వర్ రాణి అలియాస్ అనురాధ చౌదరి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. క్రైమ్ ఇండస్ట్రీలో అనురాధ చౌదరిని మేడమ్ మిన్జ్ పేరుతో కూడా పిలుస్తారు. కరుడుగట్టిన నేరస్థులిద్దరి పెళ్లి వేడుక స్థానికంగా సంచలనంగా మారింది. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు కావడంతో పోలీసులు భారీ భద్రత కల్పించారు. కల్యాణ మండపం లోపల, బయట వచ్చిన అతిథుల కంటే పోలీసులు ఎక్కువ ఉన్నట్లు కనపడటం గమనార్హం

దిల్లీ

పెరోల్‌పై వచ్చి పెళ్లి

దిల్లీ-హర్యానాకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సందీప్ అలియాస్ కాలా జాతేడి తలపై రూ.7 లక్షల రివార్డు ఉంది. ప్రస్తుతం అతడు ఓ కేసులో తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతడు వివాహం చేసుకోవాడానికి దిల్లీ కోర్టు ఆరు గంటల పెరోల్ ఇవ్వగా.. ఆ సమయంలో వచ్చి పెళ్లి చేసుకున్నాడు. అనురాధ చౌదరి కూడా పలు కేసుల్లో నిందితురాలి ఉన్నారు. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై బయట ఉన్నారు. ప్రముఖ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు కాలా జాతేడి, అనురాధ చౌదరి అత్యంత సన్నిహితులుగా చెబుతుంటారు.