NTR 100 rupees coin: ఎన్టీఆర్ స్మారకార్థం రూ.100 నాణెం విడుదల చేసిన రాష్ట్రపతి
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు స్మారకార్థం రూ.100నాణేన్ని సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్రప్రభుత్వం ఈ నాణేన్ని రూపొందించింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో రాష్ట్రపతి ఈ నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. సినిమా రంగం పురోగతిలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. రాజకీయాల్లో సైతం ఎన్టీఆర్ తన ప్రత్యేకతను చాటుకున్నట్లు రాష్ట్రపతి వివరించారు. నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది. నాణెంపై 1923-2023 సంవత్సరాలు అని రాసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, బాలకృష్ణ, చంద్రబాబుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సహా ఇతరులు హాజరయ్యారు.