
Karnataka: మతాంతర వివాహం చేసుకున్నందుకు దంపతులపై దాడి!
ఈ వార్తాకథనం ఏంటి
మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటపై ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం దాడి చెయ్యడమే కాకుండా అసభ్యంగా దుర్భాషలాడారు,అంతేకాదు ఈ ఘటన మొత్తం వీడియో తీశారు.
ఈ సంఘటన కర్ణాటకలోని హవేరీ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.
కర్ణాటకలోని హవేరీ జిల్లాలోని ఒక హోటల్‌లో బస చేస్తున్న మతాంతర వివాహం చేసుకున్న జంటను ఆరు నుంచి ఏడుగురు వ్యక్తుల బృందం అసభ్యంగా దుర్భాషలాడి, చితకొట్టిందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన జనవరి 7న జరగగా.. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటి వరకు ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Details
అక్రమార్కులు స్థానికులే..ఏ సంస్థకు సంబంధం లేదు
మతాంతర వివాహం చేసుకున్న జంట హోటల్ గదిలో ఉన్నారన్న సమాచారం అందుకున్న దుండగుల గుంపు హోటల్‌లోకి చొరబడి, దంపతులపై దాడి చేసింది.
ఆ ముఠా భార్యాభర్తలను అసభ్యపదజాలంతో దుర్భాషలాడింది. ఈ ఘటనను మొబైల్ లో చిత్రీకరించింది.
హవేరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అన్షు కుమార్ మాట్లాడుతూ, "ఇద్దరిని అరెస్టు చేశామని, త్వరలో మిగిలినవారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు.
అక్రమార్కులు స్థానికులేనని, వారికి ఏ సంస్థకు సంబంధం లేదని చెప్పారు.
మొదట్లో ఇది దాడి కేసు అనుకోని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసామని, అయితే, బాధితుల వాంగ్మూలం ఆధారంగా, కిడ్నాప్, మహిళను అగౌరవపరచడం, మహిళపై దాడి చేయడం, హత్యాయత్నం వంటి సెక్షన్లను చేర్చాలని చూస్తున్నామని ఎస్పీ కుమార్ తెలిపారు.