Page Loader
Cheetah Gamini: కునో నేషనల్ పార్క్‌లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత గామిని 
Cheetah Gamini: కునో నేషనల్ పార్క్‌లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత గామిని

Cheetah Gamini: కునో నేషనల్ పార్క్‌లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత గామిని 

వ్రాసిన వారు Stalin
Mar 11, 2024
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

చిరుత ప్రాజెక్ట్ కింద ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆడ చిరుతపులి గామిని కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో పంచుకున్నారు. ఐదేళ్ల గామిని 5 పిల్లలకు జన్మనిచ్చింది, దీంతో దేశంలో చిరుత పిల్లల సంఖ్య ప్రస్తుతం 13కు చేరిందని ఆయన వెల్లడించారు. చిరుతపులికి ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించిన అటవీశాఖ అధికారులు, పశువైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందికి కేంద్రమంత్రి అభినందనలు తెలిపారు. తాజాగా పుట్టిన పిల్లలతో కూనో పార్కులో మొత్త చిరుత పులల సంఖ్య 26కు పెరిగింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కూనో పార్కులో చిరుత పిల్లలు