
Girls missing: అక్రమంగా నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు మిస్సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో విషయం వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లోని చిల్డ్రన్స్ హోమ్ నుంచి 26 మంది బాలికలు అదృశ్యమైన ఘటన సంచలనంగా మారింది.
అనేక రాష్ట్రాలకు చెందిన బాలికలు ఆ చిల్డ్రన్స్ హోమ్‌లో నివసిస్తున్నారు.
బాలల గృహాన్ని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
అనుమతి లేకుండా బాలికా గృహం నడుపుతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భోపాల్ శివార్లలోని పర్వాలియాలో నిర్వహిస్తున్న ఆంచల్ బాలికల హాస్టల్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సమయంలో రిజిస్టర్‌ను పరిశీలించగా అందులో 68 మంది బాలికల ఎంట్రీలు ఉండగా.. 26 మంది అదృశ్యమైనట్లు గుర్తించారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్
శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్
తప్పిపోయిన బాలికలపై చిల్డ్రన్స్ హోమ్ డైరెక్టర్ అనిల్ మాథ్యూను ప్రశ్నించగా, అతను సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో.. ప్రియాంక్ కనుంగో పోలీసులకు సమాచారం అందించారు.
ఈ విషయమై జాతీయ బాలల కమిషన్ చైర్మన్ ప్రియాంక్ కనుంగో మధ్యప్రదేశ్ చీఫ్ సెక్రటరీ వీర రాణాకు లేఖ కూడా రాశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, అందులో అవకతవలు జరిగినట్లు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఆ రాష్ట్ర మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వాలా వెల్లడించారు.
ఈ విషయంపై దృష్టి సారించి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయం సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు.