మధ్యప్రదేశ్: లంచం తీసుకుంటుండగా పట్టుకున్న లోకాయుక్త; కరెన్సీని మింగేసిన అధికారి
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో రెవెన్యూ శాఖకు చెందిన అవినీతి అధికారి వింత ప్రవర్తన ఆందోళన కలిగించింది.
లంచం తీసుకుంటుండగా పట్వారీ గజేంద్ర సింగ్‌ను జబల్‌పూర్ లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్‌పీఈ) బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
ఈ క్రమంలో లంచంగా తీసుకున్న కరెన్సీ నోట్లు అధికారులకు ఇవ్వకుండా నోటిలో పెట్టుకుని నమిలాడు.
పట్వారీ చర్యతో భయాందోళనకు గురైన పోలీసు బృందం అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు అతని నోటి నుంచి నోట్లను బయటకు తీశారు.
అతను బాగానే ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పట్వారీ నోట్లను నమిలే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఎంపీ
లోకాయుక్త అధికారుల పన్ని ఉచ్చులో పడ్డ గజేంద్ర సింగ్
కాట్నీ జిల్లాలోని బద్‌ఖేరాకు చెందిన చందన్‌సింగ్ లోధి వ్యక్తి దగ్గర భూమి పట్టా జారీ విషయమై గజేంద్ర సింగ్ రూ.5వేలు లంచం డిమాండ్ చేశారు.
దీంతో బాధితుడు జబల్‌పూర్ లోకాయుక్త ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు జబల్‌పూర్ లోకాయుక్త టీమ్ ఇన్‌స్పెక్టర్ కమల్‌కాంత్ ఉకే మీడియాకు తెలిపారు.
లోకాయుక్త అధికారులు పన్నిన ఉచ్చులో గజేంద్ర సింగ్ పడ్డారు. లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఈ బృందాన్ని గుర్తించిన వెంటనే డబ్బు నమిలి గజేంద్ర సింగ్ మింగేశారు..
సింగ్‌ను అరెస్టు చేసి ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సంజయ్ సాహు తెలిపారు. గజేంద్ర సింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సాహు పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కరెన్సీ నోట్లను నముతున్న రెవెన్యూ అధికారి
A patwari in Katni, allegedly swallowed money he had accepted as a bribe after noticing a team of the Lokayukta's Special Police Establishment pic.twitter.com/AgsOyDsnGM
— Anurag Dwary (@Anurag_Dwary) July 24, 2023