LOADING...
Mulugu Bokka: మూలుగ బొక్క వేయలేదని పెళ్లి రద్దు.. ఎక్కడో తెలుసా?
Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి.. పెళ్లి రద్దు

Mulugu Bokka: మూలుగ బొక్క వేయలేదని పెళ్లి రద్దు.. ఎక్కడో తెలుసా?

వ్రాసిన వారు Stalin
Dec 24, 2023
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

'బలగం' సినిమాలో బావ బామ్మర్దుల మధ్య 'మూలుగ' బొక్క (Mooluga Bokka) కోసం జరిగిన గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి ఘటనే తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగింది.'మూలుగ' బొక్క కోసం గొడవ జరిగి చివరికి పెళ్లి రద్దు అయిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ నవంబర్‌ మొదటి వారంలో జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తెలిసిన వారు ఆశ్యర్యపోతున్నారు. జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లికి చెందిన అబ్బాయికి.. నిజామాబాద్‌‌కు చెందిన అమ్మాయితో పెళ్లి కుదురింది. రెండు కుటుంబాల వారు కట్నకానుకలను కూడా మాట్లాడుకున్నారు.

మూలుగ

గొడవ . చిలికి చిలికి.. గాలివానగా.. 

నిశ్చితార్ధం సందర్భంగా.. అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు పెట్టారు. ఈ క్రమంలో అబ్బాయి తరఫు చుట్టాలు మూలుగ బొక్క కావాలని అమ్మాయి తరఫు వాళ్లను అడిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. గొడవ చిలికి చిలికి.. గాలివానగా మారింది. ఆఖరికి ఈ గొడవ చాలా పెద్దది అయి.. ఇరు వర్గాలు పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లడం గమనార్హం. అయినా.. ఇరు వర్గాల వారు శాంతిచకపోవడంతో.. చివరికి చేసేది ఏమీ లేక.. పెళ్లి పెళ్లిని రద్దు చేసుకున్నారు. 'మూలుగ' బొక్క కోసం జరిగిన లొల్లి వల్ల పెళ్లి రద్దు అయ్యిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.