Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన తోటి స్టూడెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోరం జరిగింది. ఇంటర్ విద్యార్థిపై తోటి స్టూడెంట్స్ విచక్షణారహితంగా దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
నవంబర్ 13న జాగృతి విహార్ ప్రాంతంలోని కేఎల్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆలస్యం వెలుగులోకి వచ్చింది.
ఈ భయానక దృశ్యాలను నిందితులు వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ వీడియోను బాధితుడి కుటుంబానికి కూడా నిందితులు పంపినట్లు తెలుస్తోంది.
ఎనర్జీ కార్పొరేషన్ లైన్‌మెన్ కుమారుడైన బాధితుడు మిఠాయిలు పంచడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు నిందితులు అతన్ని కిడ్నాప్ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
యూపీ
ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు
మీరట్‌లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని నవంబర్ 13న కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత అతన్ని కేఎల్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలోని నిర్జీవ ప్రాంతంలోకి తీసుకెళ్లారు.
అనంతరం బాధితుడిపై నిందితులు వరుసగా ఒకరి తరువాత ఒకరు విచక్షణారహితంగా దాడి చేశారు. అంతేకాకుండా, మూత్ర విసర్జన చేశారు.
తనను కొట్టొద్దని బాధితుడు ఎంత బతిమాలినా నిందితులు కొట్టడం ఆపలేదని విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియా చూస్తే అర్థం అవుతుంది.
బాధుతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. అందులో అశిష్ మాలిక్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.