
Teenmaar Mallanna: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. మల్లన్న ఆఫీస్‌ను ధ్వంసం చేసిన కార్యకర్తలు!
ఈ వార్తాకథనం ఏంటి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో జాగృతి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహోద్రేకంతో గురువారం మేడిపల్లి ప్రాంతంలోని తీన్మార్ మల్లన్న (చిరుమర్తి శ్రీనివాస్) కార్యాలయంపై దాడికి దిగారు. నిరసనకారులు 'జై కవిత' నినాదాలతో కార్యాలయానికి చేరుకుని ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి జొరబడ్డారు. ఒక్కసారిగా చెలరేగిన హింసలో ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. ఈ గందరగోళం మధ్య మల్లన్నకు సెక్యూరిటీగా నియమించిన గన్‌మెన్ వాతావరణాన్ని అదుపులోకి తెచ్చేందుకు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు.
Details
ధర్యాప్తు చేపడుతున్న అధికారులు
రోజూ నిశ్శబ్దంగా ఉన్న ప్రాంతం కాల్పుల శబ్ధంతో ఒక్కసారిగా దద్దరిల్లింది. దాంతో స్థానికులు భయభ్రాంతులకు లోను కావాల్సి వచ్చింది. తక్షణమే సమాచారం అందుకున్న పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సర్దుబాటు చేశాయి. పోలీసులు విధ్వంసానికి కారణమైన జాగృతి కార్యకర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో గన్‌మెన్ కాల్పుల ఘటనపై సైతం సమగ్ర విచారణ చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో మేడిపల్లి పరిసరాలకు ఒకపుడు నెలకొన్న ప్రశాంత వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తత ముసుగులోకి వెళ్లింది.