Page Loader
IndiGo :మద్యం మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు!
మద్యం మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు!

IndiGo :మద్యం మత్తులో ఎయిర్‌హోస్టెస్‌పై అసభ్య ప్రవర్తన.. కేసు నమోదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 04, 2025
05:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ నుండి శిర్డీ వెళ్ళే ఇండిగో విమానంలో శుక్రవారం మధ్యాహ్నం దారుణ ఘటన జరిగింది. ఒక ప్రయాణికుడు, ఎయిర్‌హోస్టెస్‌పై మద్యం మత్తులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం శిర్డీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవగానే, ఎయిర్‌హోస్టెస్‌ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. నిందితుడు టాయిలెట్‌ వద్ద ఎయిర్‌హోస్టెస్‌ను అసభ్యకరంగా తాకినట్లు పోలీసులు తెలిపారు.

Details

నిందితుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది

విమానం శిర్డీలో ల్యాండ్‌ అవగానే, ఎయిర్‌హోస్టెస్‌ క్రూ మేనేజర్‌కు సమాచారం అందించిన తరువాత, భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వెంటనే రహతా పోలీస్‌ స్టేషన్‌కి తరలించి, అక్కడ కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించగా, అతడు మద్యం మత్తులో ఉన్నట్లు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. దీంతో రహతా పోలీసులు నిందితుడికి నోటీసు జారీ చేశారు.