Page Loader
Independence Day 2024: ఢిల్లీ నుండి శ్రీనగర్ వరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎలా జరుగుతున్నాయంటే 

Independence Day 2024: ఢిల్లీ నుండి శ్రీనగర్ వరకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. ఎలా జరుగుతున్నాయంటే 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2024
07:44 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం తన 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకోబోతోంది. ఇందుకోసం ఢిల్లీ నుంచి శ్రీనగర్, లడఖ్ వరకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి వరుసగా 11వ సారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసీలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై 750 మీటర్ల పొడవున్న త్రివర్ణ పతాకంతో త్రివర్ణ ర్యాలీని చేపట్టారు. వేడుకకు దేశం ఎలా సిద్ధమవుతోందో తెలుసుకుందాం.

 Details

ఢిల్లీ: త్రివర్ణ కాంతులతో భవనాలు కళకళలాడాయి

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌, పార్లమెంట్‌ హౌస్‌లను రంగురంగుల దీపాలతో అలంకరించారు. సచివాలయం నుండి అన్ని ప్రభుత్వ భవనాలు, ఇండియా గేట్, కుతుబ్ మినార్, రైసినా హిల్స్, రాజ్‌ఘాట్ తదితర భవనాలు త్రివర్ణ కాంతులతో దర్శనమిస్తున్నాయి. ఎర్రకోటలో జెండా ఆవిష్కరణకు ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. కవాతుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కవాతు రిహార్సల్ ఆగస్టు 13న జరిగింది.