Independence Day: జాతీయ జెండా పట్ల అప్రమత్తంగా ఉండండి, లేకుంటే జైలుకే!
స్వాతంత్య్ర దినోత్సవం కోసం దేశవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో జాతీయ జెండా ప్రదర్శించేందుకు ప్రజలు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే జాతీయ జెండా పట్ల అంతగా అవగాహన లేని కొందరు వ్యక్తులు ఫ్లాగ్‌ను అవమానించేలా ప్రవర్తిస్తుంటారు. జాతీయ జెండాను ఏమాత్రం అగౌరవపర్చినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. జైలు శిక్షలను కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జాతీయ జెండా పట్ల పాటించాల్సిన నియమ, నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు ఫోన్ కవర్‌పై జాతీయ జెండాను నమూనాను పెట్టుకుంటారు. ఇలా చేయడం నేరం. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 ప్రకారం, ఇలా చేస్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
జాతీయ జెండాను నేలకు తాకనిస్తే నేరం
ఒక వేళ ఫోన్ కవర్ పై జాతీయ జెండా ఉండి, అది కలర్ మారినా, మురికిగా ఉన్నా శిక్షార్హులవుతారు. జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా నేలకు తాకనిస్తే నేరం అవుతుంది. గతంలో రెండు సందర్భాల్లో మాత్రమే జాతీయ జెండాను ఆవిష్కరించేవారు. అది కూడా స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున మాత్రమే త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేవారు. 2002 తర్వాత నిబంధనలను మర్చారు. ఎప్పుడైనా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేలా నిబంధనలను మార్చారు. ఇళ్లలో కూడా జాతీయ జెండాను ఎగురవేయొచ్చు. ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేవారు రాత్రి తర్వాత జెండాను తీసేయాల్సి ఉంటుంది. చీకటి పడ్డాక జెండాను తీసేయకుంటే నేరం అవుతుంది. ఆఖరికి జెండా చిరిగినా కూడా బాధ్యులపై శిక్ష తప్పదు.