మరో రెండు హానికారక సిరప్స్ ని గుర్తించిన భారత ఔషధ నియంత్రణ సంస్థ
భారత ఔషధ నియంత్రణ సంస్థ మరో రెండు సిరప్ లను హానికారకమైనవిగా తేల్చింది. నోరిస్ మెడిసిన్స్ కంపెనీ తయారు చేసే యాంటీ ఎలర్జీ సిరప్, కాఫ్ సిరప్ లను హానికారకమైనవిగా తేల్చింది. భారతదేశంలో తయారైన మెడిసిన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 141 మంది చనిపోయినట్లు వార్తలు వచ్చిన కొద్ది నెలల తర్వాత ప్రస్తుతం మళ్ళీ హాని కారకమైన సిరప్ లు బయటపడ్డాయి. ప్రస్తుతం ఔషధ నియంత్రణ సంస్థ హానికారంకంగా భావించిన మెడిసిన్ లలో ఇథిలిన్ గ్లైకోల్, డై ఇథిలిన్ గ్లైకోల్ వంటి రసాయనాలు కలుస్తున్నాయని తెలియజేసింది.
ఇతర దేశాల్లో మరణానికి కారణమైన రసాయనాలు
ఈ రసాయనాలు గాంబియా, ఉజ్బెకిస్తాన్, కామెరూన్ వంటి దేశాల్లో గత సంవత్సరం అనేక మరణాలకు ఇథిలీన్ గ్లైకోన్, డై ఇథిలీన్ గ్లైకోల్ కారణమయ్యాయి. హానికారక సిరప్ ల విషయమై గుజరాత్ కి చెందిన రాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ అధికారి కోషియా మాట్లాడుతూ నోరిస్ కంపెనీ ఫ్యాక్టరీని సందర్శించామని, అలాగే సిరప్ ల తయారీని ఆపివేయమని ఆదేశాలు ఇచ్చామని తెలియజేశారు. ఈ సిరప్ ల తయారీలో కంపెనీ ఫెయిల్ అయిందని, సిరప్ లు తయారయ్యే ప్రాంతంలో కావలసినన్ని నీళ్లు లేవని, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్ కూడా సరిగ్గా లేదని.. అందువల్ల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సిరప్ ల తయారీని పూర్తిగా ఆపివేయాలని ఆదేశించినట్లు కోషియా తెలియజేశారు.