LOADING...
Grok: Grok Imagine‌లో AI ఇమేజ్‌లు ఎలా సృష్టించాలి..  ఎలాన్ మస్క్ సూచనలు 
Grok Imagine‌లో AI ఇమేజ్‌లు ఎలా సృష్టించాలి.. ఎలాన్ మస్క్ సూచనలు

Grok: Grok Imagine‌లో AI ఇమేజ్‌లు ఎలా సృష్టించాలి..  ఎలాన్ మస్క్ సూచనలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 05, 2026
04:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్‌ AI ఇమేజ్ టూల్‌ గ్రోక్ ఇమాజిన్ (Grok Imagine) ఉపయోగించి ఎలా మంచి ఫలితాలు పొందొచ్చో సూచనలు పంచుకున్నారు. xAI వ్యవస్థాపకుడైన మస్క్‌ ఈ టిప్స్‌ను తన ప్లాట్‌ఫామ్‌ ద్వారా షేర్ చేశారు. మొదట ఈ గైడ్‌ను AI అభిమాని @karatademada పోస్టు చేయగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరైన విధంగా ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల AI తయారు చేసే చిత్రాలు, వీడియోలు మరింత మెరుగ్గా వస్తాయని ఇందులో స్పష్టం చేశారు. ముఖ్యంగా సాధారణంగా మాటలు టైప్ చేయడం కంటే, దర్శకుడిలా ఆలోచించి ప్రాంప్ట్ ఇవ్వాలన్నదే ప్రధాన సూచన.

వివరాలు 

ఇలా వివరంగా ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల..

మంచి ఫలితాల కోసం డీటెయిల్‌ ప్రాంప్ట్‌లు చాలా అవసరమని గైడ్‌ చెబుతోంది. ఉదాహరణకు "రోడ్డుపై నడుస్తున్న ఓ మహిళ" అని మాత్రమే చెప్పడం కాకుండా, ఆ సన్నివేశాన్ని పూర్తిగా వివరించాలి. "వర్షం పడుతున్న పారిస్ వీధిలో రాత్రి ఒంటరిగా నడుస్తున్న మహిళ, తడిచిన రోడ్డుపై నీయాన్ లైట్ల ప్రతిబింబాలు" అంటూ వివరంగా చెప్పితే, గ్రోక్ ఇమాజిన్‌కు సన్నివేశంపై స్పష్టమైన దిశ లభిస్తుందని పేర్కొన్నారు. ఇలా వివరంగా ప్రాంప్ట్ ఇవ్వడం వల్ల సినిమాటిక్‌ లుక్‌ ఉన్న చిత్రాలు, వీడియోలు తయారవుతాయి.

వివరాలు 

భావోద్వేగాలు జోడించడం వల్ల చిత్రాలకు మరింత జీవం

ప్రాంప్ట్‌లలో భావోద్వేగాలను కూడా కలపాలని గైడ్‌ సూచిస్తోంది. సాధారణ పదాల కంటే, భావం కనిపించే మాటలు వాడాలని చెబుతోంది. ఉదాహరణకు "ఎండలో ఆనందంగా ఉన్న అమ్మాయి" అని చెప్పడం కంటే, "బంగారు రంగు సూర్యకాంతిలో నవ్వుతూ ఉన్న స్వేచ్ఛగా ఉన్న యువతి క్లోజ్-అప్ షాట్" అని చెప్పితే మంచి ఫలితం వస్తుందని వివరించారు. ఇలా భావోద్వేగాలు జోడించడం వల్ల చిత్రాలకు మరింత జీవం వస్తుందని తెలిపారు. అలాగే కెమెరా, ఫోటోగ్రఫీకి సంబంధించిన పదాలను కూడా ప్రాంప్ట్‌లో ఉపయోగించాలని సూచించారు. అలా చేస్తే సన్నివేశాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలో AIకి అర్థమవుతుంది.

Advertisement

వివరాలు 

స్థిరమైన ఫలితాల కోసం ఐదు దశల విధానం 

"ఉదయాన్నే కనిపించే భవిష్యత్తు నగర దృశ్యానికి వైడ్ ఎస్టాబ్లిషింగ్ షాట్" లేదా "నగరాన్ని చూస్తూ భవనంపై నిలబడ్డ హీరోకి లో-యాంగిల్ సినిమాటిక్ షాట్" లాంటి పదాలు వాడితే చిత్రానికి లోతు, కథనం వస్తాయని తెలిపారు. స్థిరమైన ఫలితాల కోసం ఐదు దశల విధానాన్ని కూడా గైడ్‌ సూచించింది. అందులో ఏం జరుగుతోంది, విజువల్ స్టైల్, మూడ్‌, లైటింగ్‌, కెమెరా యాంగిల్ అనే అంశాలు ఉండాలి. ఈ విధానాన్ని పాటిస్తే గ్రోక్ ఇమాజిన్‌తో ఒకేలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. సాధారణంగా "పొగమంచు కమ్ముకున్న కొండపై నిలబడ్డ సమురాయి" అని చెప్పే బదులు, ఈ ఐదు అంశాలతో వివరంగా చెప్పాలని సూచించారు.

Advertisement

వివరాలు 

ఇప్పటికే ఉన్న చిత్రాలను మెరుగుపరచడానికీ ఉపయోగపడుతుంది 

గ్రోక్ ఇమాజిన్ కొత్త చిత్రాల తయారికే కాకుండా, ఇప్పటికే ఉన్న చిత్రాలను మెరుగుపరచడానికీ ఉపయోగపడుతుందని మస్క్‌ చెప్పారు. ఇప్పటికే ఉన్న ఇమేజ్‌కు మరిన్ని వివరాలు జోడించమని లేదా పరిసరాలను మార్చమని AIకి చెప్పొచ్చు. ఉదాహరణకు "అదే చిత్రం, కానీ కిటికీ ద్వారా మృదువైన ఉదయపు సూర్యకాంతి వచ్చేలా చేయండి" అని అడగవచ్చని వివరించారు. ఈ ఫీచర్‌తో ఒకే చిత్రాన్ని క్రమంగా మెరుగుపరుచుకుంటూ కథలా అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు.

Advertisement