మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు
అటవీ శాఖను మినహాయించి,ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ నిర్ణయించింది. ప్రభుత్వం ఇటీవల మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్(మహిళల నియామకం కోసం ప్రత్యేక నిబంధన) రూల్స్, 1997కి సవరణను ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటన మేరకు సాధారణ పరిపాలన శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అటవీ శాఖ మినహా అన్ని ప్రభుత్వ శాఖలకు 35% కోటా ఫార్ములా వర్తిస్తుంది. పంచాయతీలు,పట్టణ సంస్థల ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్. అలాగే పోలీసుల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఒక మహిళ పేరు మీద ఆస్థి ఉన్నట్లయితే,ఆస్తి రిజిస్ట్రీ కోసం రాష్ట్రం రాయితీ సుంకాలను కూడా అందిస్తుంది.
మహిళల కోసం "లాడ్లీ బహనా యోజన"
ఒక మహిళ పేరు మీద ఆస్థి ఉన్నట్లయితే,ఆస్తి రిజిస్ట్రీ కోసం రాష్ట్రం రాయితీ సుంకాలను కూడా అందిస్తుంది. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ముఖ్యమంత్రి కన్యాదాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబరు నెలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్న నేపథ్యంలో,మహిళల కోసం బిజెపి ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ సంక్షేమ పథకం క్రింద "లాడ్లీ బహనా యోజన" కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని బదిలీ చేయనున్నట్లు చౌహాన్ ప్రకటించారు. ఈ పథకం కింద,రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారునికి నెలకు₹1,250 అందిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలి కాలంలో మహిళా ఓటర్ల తీర్పు నిర్ణయాత్మకంగా మారుతుండడంతో,అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మహిళల రిజర్వేషన్లను ప్రధాన ప్రచారాస్త్రంగా పరిగణిస్తోంది.