Congress: NDA మిత్రపక్షాలకు పోర్ట్‌ఫోలియో, కేటాయింపులపై కాంగ్రెస్ దాడి
ఎన్డీయే మిత్రపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని తన మిత్రపక్షాలను భ్రమింప చేశారని పేర్కొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాని మిత్రపక్షాలపై.. ప్రతిపక్షాల భారత కూటమి (ఇండియా)సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వాములకు అన్యాయం జరిగిందని పేర్కొంది.
బిజెపికి అగ్ర పీఠం,మిత్రపక్షాలకు మొండి చేయి
సంకీర్ణ ధర్మం అనే సామెతను గ్రహించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ -ఎన్డీయే మిత్రపక్షాలకు గణనీయమైన ప్రాతినిధ్యం కల్పించింది. అయితే హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలతోపాటు చాలా వరకు కీలక మంత్రిత్వ శాఖలను పార్టీ ఎంపీలకే కేటాయించారు. మహారాష్ట్రలోని తన మిత్రపక్షాలను ప్రధాని మోదీ ప్రాధేయపడేలా చేశారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. ఎన్‌సిపి నేత ప్రఫుల్ పటేల్ మోదీ మంత్రివర్గంలో సహాయ మంత్రి గా వుండటానికి ఇష్టపడలేదన్నారు. అందుకే ఆ ప్రతిపాదనను "తిరస్కరించారని" జైరాం రమేష్ గుర్తు చేశారు.
వాషింగ్ మెషీన్ పని తీరులో వైవిధ్యం
"బిజెపి-బ్రాండ్ వాషింగ్ మెషీన్ ప్రత్యేక లక్షణం 'స్లో, ఫాస్ట్ సూపర్-ఫాస్ట్' అని వివిధ మోడ్‌లను కలిగి ఉందని (పటేల్) తెలుసుకోవాలని చమత్కరించారు. ఆయన గ్రహించి వుండకపోవచ్చన్నారు. మరోవైపు, రవ్‌నీత్ బిట్టు స్వతంత్ర అభ్యర్ధి లూథియానాలో తమ పార్టీ చేతిలో ఓడిపోయారు. కానీ తర్వాత కూడా సూపర్-ఫాస్ట్ మోడ్‌లో ఉన్నట్లు స్పష్టంగా ఉంది" అని కాంగ్రెస్ నాయకుడు ఎక్స్‌లో అన్నారు. రవ్‌నీత్ బిట్టుకు తాజాగా కేంద్రంలో మంత్రి పదవి దక్కింది.