LOADING...
PM Modi: శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ
శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ

PM Modi: శ్రామిక శక్తి నుంచి ప్రపంచ శక్తిగా 'భారత్' మారింది : మోదీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ ఇప్పుడు ప్రపంచ కర్మాగారంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒకప్పుడు ప్రపంచ దేశాలు భారత్‌ను ఓ ఉప శాఖగా చూసేవని, కానీ ప్రస్తుతం ఆ దృక్పథం పూర్తిగా మారిపోయిందని స్పష్టం చేశారు. దేశ రాజధానిలో నిర్వహించిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. భారత్ గురించి ప్రస్తుతం అంతర్జాతీయంగా చాలా సానుకూల వార్తలు వెలువడుతున్నాయని, అందుకే ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోందని అన్నారు. ప్రపంచ ప్రజలు ఇప్పుడు భారత్‌ను మరింతగా తెలుసుకోవాలని, ఇక్కడికి రావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.

Details

వేగంగా అభివృద్ధి చెందుతోంది

గతంలో శ్రామిక శక్తిగా ఉన్న భారత్, ఇప్పుడు ప్రపంచ శక్తిగా మారిపోతోందని ప్రధాని మోదీ అన్నారు. సెమీకండక్టర్లు, విమాన వాహక నౌకల తయారీ, ఆటోమొబైల్ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. అంతేకాక మఖానా, మిల్లెట్‌లు, ఆయుష్ ఉత్పత్తులు, యోగా, ధ్యానం వంటి భారతీయ సంప్రదాయాలను విదేశీయులు కూడా స్వీకరిస్తున్నారని పేర్కొన్నారు.

Details

మూడోసారి ఎన్డీఏ విజయంపై ప్రధాని హర్షం

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి విజయం సాధించడం, ప్రజలు తమపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. నూతనంగా ప్రారంభించిన గ్లోబల్ న్యూస్ ఛానల్ ద్వారా భారత విజయాలను, స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. భారత్ అభివృద్ధిలో ముందడుగు వేస్తూ అంతర్జాతీయ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోందని మోదీ చెప్పారు. ఇటీవల మహాకుంభమేళా ఘనంగా నిర్వహించడంతో, భారత నిర్వహణానైపుణ్యాలు, ఆవిష్కరణలు ప్రపంచానికి మరోసారి తెలిసాయని పేర్కొన్నారు. తమ పాలనలో కాలం చెల్లిన అనేక చట్టాలను రద్దు చేసి, కొత్త చట్టాలను తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.