Russian Oil: రష్యా నుంచి భారత్'కు 144 బిలియన్ యూరోల విలువైన చమురు దిగుమతి : ఐరోపా సంస్థ
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా చమురు (Russian Oil)తగ్గిన ధరలలో భారత్ కొనుగోలు చేస్తోన్నది తెలిసిందే. అటు నుండి భారత్ సుమారు 144 బిలియన్ యూరోల (సుమారు 15లక్షల కోట్ల రూపాయల విలువ) క్రూడ్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంది. దిగుమతి చేసిన మొత్తం శిలాజ ఇంధనాల విలువ 162.5బిలియన్ యూరోలు చేరిందని ఐరోపా ఆధారిత సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ఎయిర్(CREA)వెల్లడించింది. అయితే CREA అంచనాల ప్రకారం,ఫిబ్రవరి 2022 నుంచి, అంటే యుద్ధం మొదలైనప్పుడు రష్యా ప్రపంచ దేశాలకు చమురు విక్రయించడం ద్వారా ఒక ట్రిలియన్ యూరోలు ఆదాయం పొందింది. రష్యా చమురును రాయితీ ధరల్లో విక్రయించడం ప్రారంభించడంతో, చైనా తర్వాత భారత్ అత్యంత పెద్ద దిగుమతిదారుగా మారింది.
వివరాలు
మిత్ర దేశాలు ఆందోళన
ఫలితంగా,భారత్‌లో మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా 1% నుంచి 40% వరకు పెరిగింది. CREA తెలిపినట్లుగా చైనా సుమారు 210.3 బిలియన్ యూరోల చమురును కొనుగోలు చేసింది. గ్యాస్,బొగ్గు వంటి ఇతర ఇంధనాలతో కలిపి ఈ మొత్తం 293.7 బిలియన్ యూరోలు చేరిందని తెలిపారు. ఇవి కొన్నేళ్లుగా అమెరికా,దాని మిత్ర దేశాల ఆందోళనకు కారణం అవుతున్నాయి.ఈ కొనుగోళ్లు ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్టు మిత్ర దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పుతిన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి,లుకోయిల్,రాస్‌నెఫ్ట్ వంటి ఆయిల్ ఉత్పత్తిదారులపై అమెరికా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. CREA నివేదిక ప్రకారం,ఈ నాలుగు సంవత్సరాలుగా భారత్ రష్యా శిలాజ ఇంధనాలపై 218.1 బిలియన్ యూరోలు ఖర్చు చేసినట్లు గమనార్హం.