LOADING...
CDS: అణు బెదిరింపులకు భారత్ భయపడదు : సీడీఎస్ అనిల్ చౌహాన్
అణు బెదిరింపులకు భారత్ భయపడదు : సీడీఎస్ అనిల్ చౌహాన్

CDS: అణు బెదిరింపులకు భారత్ భయపడదు : సీడీఎస్ అనిల్ చౌహాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోనందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ అనిల్ చౌహాన్ చెప్పారు. ఆయన అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో అణు బెదిరింపులు, రేడియోధార్మిక పదార్థాల ప్రయోగాలు వంటి వాటిని కొన్ని దేశాలు యుద్ధతంత్రాలుగా ఉపయోగించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి, అణ్వాయుధాల వల్ల వచ్చే రేడియోధార్మిక కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకుని భారత సైన్యంలో ప్రత్యేక శిక్షణ అవసరం ఉంటుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్‌ అప్రమత్తంగా ఉండాలని చౌహాన్ సూచించారు. మిలిటరీ నర్సింగ్ సర్వీసెస్ 100వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసంగిస్తూ, ఇతర దేశాల నుంచి వచ్చే అణు బెదిరింపులకు వ్యతిరేకంగా పోరాడడానికి భారత్ అన్ని విధాలా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

Details

భారీగా అణ్వాయుధాల తయారీ

ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రధాన మంత్రి మోదీ కూడా దేశానికి అణు బెదిరింపులకు భయపడకూడదని చెప్పారు అని చౌహాన్ గుర్తుచేశారు. అందుకు అనుగుణంగా దేశంలో రక్షణ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకోవాలని CDS సూచించారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాలు భారీగా అణ్వాయుధాల తయారీని చేపడుతున్నాయని పేర్కొన్నారు. 1926లో స్థాపించబడిన మిలిటరీ నర్సింగ్ సర్వీస్ వందేళ్లుగా దేశ సైన్యానికి సేవలు అందిస్తున్నందున, చౌహాన్ వీరి సేవలను కొనియాడారు. యుద్ధాల్లో సైనికులు ఉన్నా, సముద్రాలపై ఓడల్లో ఉన్నా, నర్సింగ్ సిబ్బంది అన్ని అడ్డంకులను ఎదుర్కొని వారిని కాపాడుతున్నారని ఆయన చెప్పారు.