India Heatwave 2026: వేడితో వణుకుతున్న భారత్.. ప్రపంచంలో టాప్-20లో 19 ప్రాంతాలు మనవే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత మరింత పెరిగి ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. సూర్యుడి తాపానికి దేశం మొత్తం ఉక్కిరిబిక్కిరవుతుండగా, ప్రపంచ స్థాయిలో చూస్తే భారత్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 21 మధ్యాహ్నం 12:21 గంటలకు AQI.in విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన టాప్-20 ప్రాంతాల్లో 19 భారత్‌లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వేడికి ఇండియా ఇప్పుడు ప్రధాన కేంద్రంగా మారిందని ఈ వివరాలు సూచిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ వెలుపల చోటు దక్కిన ఏకైక ప్రాంతం లుంబిని మాత్రమే. ఏప్రిల్ 22 నుంచి 24 వరకు వడగాలులు కొనసాగనున్నాయి. ఈ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల సెల్సియస్ వరకు చేరే అవకాశం ఉంది.
వివరాలు
వేడి నగరాల్లో భారత్ ఆధిపత్యం
ప్రపంచంలో అత్యంత వేడి నగరాల జాబితాలో బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నగరాలు ముందంజలో ఉన్నాయి. బీహార్‌లోని భాగల్పూర్ ఒడిశాలోని తాల్చేర్ పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. అలాగే బీహార్‌లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్‌పూర్, సివాన్ ప్రాంతాలతో పాటు పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వివరాలు
ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణాలు
మేఘాలు లేకపోవడంతో సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం ఏప్రిల్‌లో సహజంగానే ఉండే వేడి ఈసారి మరింత తీవ్రంగా ఉండటం యూరేషియా, హిమాలయ ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు తక్కువగా పడటం మంచు లేకపోవడంతో సూర్యకిరణాలు తిరిగి ప్రతిఫలించకుండా భూమిలోనే వేడి నిల్వ కావడం పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వాతావరణ ప్రసరణలో మార్పుల వల్ల చల్లని గాలులు తగ్గిపోవడం వాయువ్య దిశ నుంచి వీస్తున్న పొడి గాలులతో మేఘాల ఏర్పాటుకు ఆటంకం కలగడం ఈ కారణాల వల్ల వర్షపాతం తగ్గి, వేడి గాలులు (హీట్‌వేవ్స్) తీవ్రంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా వాతావరణ మార్పుల ప్రభావంతో భారత్‌లో ఎండలు మరింత ఉధృతమవుతూ, ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలలో కీలక కేంద్రంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది.