LOADING...
Nepal: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు కీలక అడ్వైజరీ
నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు కీలక అడ్వైజరీ

Nepal: నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు.. భారతీయులకు కీలక అడ్వైజరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన ఉద్యమం తీవ్ర హింసాత్మక రూపాన్ని తీసుకుంది. వేలాదిమంది జనరేషన్ జెడ్ (Gen Z) యువకులు సోమవారం నాడు దేశ రాజధాని కాఠ్మాండూ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఉద్యమం రణరంగంగా మారడంతో, నిరసనల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. నేపాల్‌లోని భారతీయ పౌరులకు 'జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలి' అని కీలక సూచనలు తెలిపే అడ్వైజరీని విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

వివరాలు 

నేపాల్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలి

నేపాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. భారతీయ పౌరులు స్థానిక అధికారుల సూచనలు కట్టుబడి, జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ప్రమాదకర సంఘటనల్లో పాల్గొనకుండా ఉండాలని పేర్కొంది. "నిన్నటి నుంచి నేపాల్‌లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాము. చాలామంది యువత ప్రాణాలను కోల్పోవడం చాలా విచారకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. కాఠ్మాండూ సహా అనేక ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించారు. నేపాల్‌లోని భారతీయ పౌరులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలి. అక్కడి అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలి' అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేపాల్ లోని భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసిన విదేశాంగ శాఖ