LOADING...
Hormuz Strait Tensions: హర్మూజ్‌లో చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం హెచ్చరిక
హర్మూజ్‌లో చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం హెచ్చరిక

Hormuz Strait Tensions: హర్మూజ్‌లో చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 09, 2026
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. పరిస్థితులు పూర్తిగా సర్దుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌ పరిసర జలాల్లో ఉన్న భారత నావికులు భద్రతను దృష్టిలో పెట్టుకుని సున్నిత ప్రాంతాలకు వెళ్లకూడదని సూచించింది. అత్యవసరం అయితే తప్ప నౌకల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. నావికులు ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులో ఉండాలని తెలిపింది.

వివరాలు 

పరిస్థితులను ఉద్రిక్తం చేసిన లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

నౌకలలో ఉన్నవారు అక్కడే ఉండి పరిస్థితులను గమనించాలని, అధికారులు ఇచ్చే సూచనలను కచ్చితంగా పాటించాలని కోరింది. అలాగే తమ కంపెనీ ప్రతినిధులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది. ఇటీవల దాదాపు 40 రోజుల ఉద్రిక్తతల తర్వాత ఇరాన్‌-అమెరికా మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు మళ్లీ పరిస్థితులను ఉద్రిక్తం చేశాయి. దీనిపై స్పందించిన ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిని మరోసారి మూసివేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం భారత నావికులకు తాజా అడ్వైజరీ జారీ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భారత నావికులకు కేంద్రం కీలక ఆదేశాలు

Advertisement