Loading...
Asia Power Index 2026: ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్‌కు మూడో స్థానం.. మోదీకి రెండో ర్యాంక్
ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్‌కు మూడో స్థానం.. మోదీకి రెండో ర్యాంక్

Asia Power Index 2026: ఆసియా పవర్ ఇండెక్స్ 2026లో భారత్‌కు మూడో స్థానం.. మోదీకి రెండో ర్యాంక్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

2026 ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్ తన సత్తా చాటింది. ఆసియాలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గతంతో పోలిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన లోవీ ఇన్‌స్టిట్యూట్ సోమవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో చైనా మొదటి స్థానంలో నిలవగా.. అమెరికా రెండో స్థానాన్ని దక్కించుకుంది. దౌత్య సంబంధాలు,రక్షణ రంగ భాగస్వామ్యాలు,సాంస్కృతిక ప్రభావం వంటి అంశాలు భారత్‌కు ఈ గుర్తింపు రావడానికి ప్రధాన కారణాలని నివేదిక వివరించింది. దేశాల ర్యాంకింగ్స్‌తో పాటు ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన ప్రాంతీయ నాయకుల జాబితాను కూడా లోవీ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.

వివరాలు 

చైనాతో తగ్గిన అంతరం

ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండో స్థానంలో నిలిచారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్ మొత్తం పవర్ స్కోరు 40.5పాయింట్లుగా నమోదైనట్లు నివేదిక పేర్కొంది.

దీంతో భారత్, చైనాల మధ్య శక్తి సామర్థ్యాల అంతరం గణనీయంగా తగ్గిందని వెల్లడించింది.

అయితే భారత్‌తో పోలిస్తే చైనా మొత్తం శక్తి సామర్థ్యం సుమారు 80శాతం ఎక్కువగా ఉందని తెలిపింది.

వివిధ రంగాల్లో భారత్ సాధించిన స్కోర్లను పరిశీలిస్తే.. దౌత్యపరమైన ప్రభావంలో 70.3పాయింట్లతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది.

భవిష్యత్ వనరుల విభాగంలో 56.2పాయింట్లు సాధించింది.దేశ ఆర్థిక సామర్థ్యానికి సంబంధించి 26.4 పాయింట్లు నమోదయ్యాయి.

ఈ గణాంకాలు అంతర్జాతీయంగా భారత్ ప్రభావం పెరుగుతున్న తీరును సూచిస్తున్నాయని నివేదిక వివరించింది.

వివరాలు 

2018 తర్వాత ఇదే అత్యల్ప అంతరం

లోవీ ఇన్‌స్టిట్యూట్‌లోని ఆగ్నేయాసియా ప్రోగ్రామ్ డైరెక్టర్ హంటర్ మార్స్టన్ కూడా భారత్ ర్యాంకింగ్‌పై స్పందించారు.

40.6 పాయింట్లతో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆసియాలో ప్రధాన శక్తిగా ఎదిగిందని వెల్లడించారు.

2018 తర్వాత చైనాతో భారత్‌కు ఉన్న అంతరం ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారని పేర్కొన్నారు.

భారత్ ఆర్థిక సామర్థ్యంలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆసియాలో రెండో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా నిలిచారని హంటర్ మార్స్టన్ తన ఎక్స్ ఖాతాలో వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఎనిమిది అంశాల ఆధారంగా ర్యాంకింగ్స్

ఆసియా పవర్ ఇండెక్స్‌లో దేశాల స్థానాలను నిర్ణయించేందుకు లోవీ ఇన్‌స్టిట్యూట్ పలు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది.

ఈ జాబితాలో ఆసియాలోని 27 దేశాలు, వాటి భూభాగాల సామర్థ్యాన్ని విశ్లేషిస్తుంది.

ఆయా దేశాల శక్తి, ఆర్థిక పరిస్థితి, సైనిక సామర్థ్యం, దౌత్య ప్రభావం, ఆర్థిక సంబంధాలు సహా మొత్తం ఎనిమిది అంశాలను పరిశీలిస్తుంది.

ఈ అంశాల ఆధారంగా దేశాల ప్రస్తుత శక్తి సామర్థ్యాలు, ప్రాంతీయంగా వాటి ప్రభావం, భవిష్యత్తులో ఎదిగే అవకాశాలను అంచనా వేసి ర్యాంకులు కేటాయిస్తుంది.

ఈ నేపథ్యంలో 2026 జాబితాలో భారత్ మూడో స్థానాన్ని నిలబెట్టుకోవడం ఆసియాలో తన ప్రాధాన్యాన్ని మరింత పెంచుకున్నట్లు స్పష్టమవుతోంది.

ADVERTISEMENT