LOADING...
India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు..
టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు..

India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు..

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2025
07:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్ధతుగా నిలిచిన టర్కీపై భారత ప్రభుత్వం, భారతీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఇప్పటికే భారతదేశం టర్కీ ఆపిల్స్‌కు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నప్పటికీ,ఇప్పుడు భారతీయ వ్యాపారులు ఆ దేశ ఆపిల్స్‌పై నిషేధం విధించారు. అంతేకాకుండా, టర్కీకి పర్యటనలుగా వెళ్లే టూర్లను కూడా భారతీయులు రద్దు చేసుకుంటున్నారు. అంతేకాక, టర్కీ దేశంలోని విద్యాసంస్థలతో భారత్‌కు చెందిన యూనివర్సిటీలు చేసుకున్న విద్యా ఒప్పందాలను కూడా వెనక్కి తీసుకుంటున్నాయి. ఇది రెండు దేశాల మధ్య విద్యా సంబంధాలపై ప్రభావం చూపించనుంది. తాజాగా మరో కీలక చర్యగా, టర్కీకి చెందిన సంస్థలు భారత విమానాశ్రయాల్లో అందిస్తున్న ప్రయాణికుల సేవలు, కార్గో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలపై భారత్ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

భద్రతా అనుమతులను రద్దు చేసిన భారత్ 

మే 15న విడుదల చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం,జాతీయ భద్రతా పరంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భారత సివిల్ ఏవియేషన్ భద్రతా విభాగమైన BCAS (Bureau of Civil Aviation Security) టర్కీకి చెందిన 'Celebi Airport Services India Pvt Ltd' అనే సంస్థకు ఇప్పటి వరకూ ఇచ్చిన భద్రతా అనుమతిని తక్షణమే రద్దు చేసింది. ఈ సంస్థ నవంబర్ 21, 2022న గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీగా గుర్తింపు పొందింది.

వివరాలు 

జాతీయ భద్రతకు ప్రాధాన్యత

ఈ సంస్థ ఢిల్లీ,ముంబై,చెన్నైతదితర తొమ్మిది ప్రధాన విమానాశ్రయాల్లో అత్యంత ముఖ్యమైన హై సెక్యూరిటీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇందులో గ్రౌండ్ హ్యాండ్లింగ్,కార్గో సేవలు,ఎయిర్‌సైడ్ ఆపరేషన్లు వంటి కీలక సేవలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న తాజా చర్య, జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టర్కీపై భారత ఆగ్రహాన్ని చాటిచెప్పింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు..