Page Loader
Corona Virus: కరోనా డేంజర్‌ బెల్స్‌..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి
రోనా డేంజర్‌ బెల్స్‌..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు

Corona Virus: కరోనా డేంజర్‌ బెల్స్‌..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు.. 5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

గత కొన్ని రోజులుగా భారత్‌లో కరోనా మహమ్మారి మళ్లీ ప్రభావం చూపుతోంది. ప్రతి రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 500కుపైగా కొత్త కేసులు నమోదుకావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వ్యక్తుల సంఖ్య 5 వేల మార్క్‌కు దగ్గరగా చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, బుధవారం ఉదయం 8గంటల నుంచి గురువారం ఉదయం 8గంటల వరకూ మొత్తం 564 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి,2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,866కు చేరింది.

వివరాలు 

కరోనా మృతుల మొత్తం సంఖ్య 51

రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే, కేరళలో అత్యధికంగా 1,487 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనంతరం ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్‌లో 538, మహారాష్ట్రలో 526, గుజరాత్‌లో 508, కర్ణాటకలో 436, తమిళనాడులో 213 కేసులు నమోదు అయ్యాయి. కాగా, గత 24 గంటల్లో దేశంలో మొత్తం ఏడుగురు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో ఒక 5 నెలల చిన్నారి సహా ఇద్దరు మృతి చెందారు. కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు కొవిడ్‌తో మరణించారు. ఈ తాజా మరణాలతో ఈ ఏడాది కరోనా వల్ల మృతుల మొత్తం సంఖ్య 51కి చేరుకుంది. ఇక, ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 3,955 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 కరోనా డేంజర్‌ బెల్స్‌..4866కి పెరిగిన యాక్టివ్ కోవిడ్-19 కేసులు