
Amit Shah: భారత్-మయన్మార్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తాం: అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-మయన్మార్ సరిహద్దుల్లో ఓపెన్ బోర్డర్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అసోంలో ప్రకటించారు.
మయన్మార్ నుంచి చొరబాట్లు పెరగడం, దేశం నుంచి ఉగ్రవాదులు పారిపోవడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం రెండు దేశాల మధ్య స్వేచ్ఛా సంచారానికి చెక్ పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
అందులో భాగంగా సరిహద్దులో కంచె ఏర్పాటు చేస్తామని అమిత్ షా వెల్లడించారు.
గువాహటిలో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్‌లో అమిషా షా పాల్గొని మాట్లాడారు.
మయన్మార్ సరిహద్దులో బంగ్లాదేశ్ తరహాలో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయడం చేస్తామని పేర్కొన్నారు. దీంతో సరిహద్దును సురక్షితంగా ఉంచుతామన్నారు.
అమిత్ షా
నాలుగు రాష్ట్రాలతో మయన్మార్ సరిహద్దు
మయన్మార్ భారతదేశంలోని 4 రాష్ట్రాలతో తన సరిహద్దును పంచుకుంటుంది.
రెండు దేశాల మధ్య 1600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భారత్, మయన్మార్ మధ్య స్వేచ్ఛా సంచార ఒప్పందం 1970లో ప్రారంభమైంది.
అప్పటి నుంచి ప్రభుత్వం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది.
మయన్మార్‌లో తిరుగుబాటు గ్రూపులు, సైన్యం మధ్య పోరు తీవ్రమవుతోంది.
ఈ క్రమంలో మయన్మార్‌కు చెందిన 600 మంది సైనికులు అక్కడి నుంచి పారిపోయి భారతదేశంలోని మిజోరంలో తలదాచుకున్నారు.
ఈ సమస్యపై మిజోరాం ప్రభుత్వం కేంద్రం సహాయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో అమిత్ షా కంచెను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.