NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు 
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు 
    ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు

    Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 09, 2025
    04:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆపరేషన్‌ సిందూర్‌ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ యూకే విదేశాంగ మంత్రి డేవిడ్‌ ల్యామితో కీలక చర్చలు జరిపారు.

    ఈ సమావేశానికి భారత్‌ తరఫున ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పరమేశ్వరన్‌ అయ్యర్‌ హాజరయ్యారు.

    పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తోందన్న అంశాన్ని భారత్‌ గట్టిగా ప్రస్తావించింది. ఆ దేశానికి నిధులు సమకూరేలా చేసే చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది.

    టెర్రరిజాన్ని అణచివేయాలన్న మనస్సు పాకిస్తాన్‌ చూపడం లేదని భారత్‌ స్పష్టం చేసింది. బుధవారం బ్రిటన్‌ పార్లమెంటులో పహల్గాం ఘటన, భారత్‌ ప్రతిచర్యగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అంశాలు చర్చకు వచ్చాయి.

    ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌, పాక్‌లు సంయమనం పాటించాలంటూ ఎంపీలు బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

    Details

    ఉద్రికత్తలు

    సమస్యలను దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాని కీర్‌ స్టార్మర్‌ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎంపీ హమిష్‌ ఫాక్నర్‌ చర్చ ప్రారంభించారు.

    బ్రిటన్‌కు భారత్‌, పాక్‌లతో సమీప సంబంధాలున్నాయని, పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నట్లు ఫాక్నర్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, భారత్‌ పాక్‌ను అంతర్జాతీయ వేదికలపై ఒడిగడుతున్నది.

    ఇప్పటికే ఆపరేషన్‌ సిందూర్‌ సంబంధిత విషయాలను అమెరికా సహా మిత్రదేశాలకు తెలియజేసింది.

    నిన్న రాత్రి విదేశాంగ మంత్రి జైశంకర్‌, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్‌లో మాట్లాడారు.

    ఉగ్రవాదానికి ఏ మాత్రం సహనం ఉండదని, అవసరమైతే కఠిన నిర్ణయాలకు వెనుకాడబోమని ఆ సందర్భంలో రూబియో తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్‌ ఆందోళన.. యూకే మంత్రితో జైశంకర్‌ కీలక చర్చలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Indo-Pak Tensions: ఆరోగ్య మౌలిక సదుపాయాలపై జేపీ నడ్డా సమీక్ష జేపీ నడ్డా
    High Alert In Rajasthan:రాజస్థాన్‌లో సైరన్లతో బ్లాక్‌అవుట్‌.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు రాజస్థాన్
    Air Raid Sirens In Delhi: ఢిల్లీలోని పిడబ్ల్యుడి ప్రధాన కార్యాలయంలో వైమానిక దాడి సైరన్  పరీక్ష దిల్లీ

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులతో విరుచుకుపడ్డ భారత్ భారతదేశం
    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై 'ఆపరేషర్‌ సిందూర్‌'.. దేశవ్యాప్తంగా అప్రమత్తమైన భద్రతా బలగాలు, పోలీసులు  భారతదేశం
    Vyomika Singh and Sophia Qureshi:ఆపరేషన్ సింధూర్..ఎవరి..సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ ? భారతదేశం
    Operation Sindoor: పాక్‌లో ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడి.. మాజీ, ప్రస్తుత క్రికెటర్ల స్పందనలివే!  క్రీడలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025