LOADING...
Indrajal Ranger: భారతదేశపు మొట్టమొదటి పూర్తి మొబైల్, AI- ఆధారిత యాంటీ-డ్రోన్ పెట్రోల్ వాహనం ప్రారంభం
భారతదేశపు మొట్టమొదటి పూర్తి మొబైల్,AI- ఆధారిత యాంటీ-డ్రోన్ పెట్రోల్ వాహనం

Indrajal Ranger: భారతదేశపు మొట్టమొదటి పూర్తి మొబైల్, AI- ఆధారిత యాంటీ-డ్రోన్ పెట్రోల్ వాహనం ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2025
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే మొదటి ఆటోనమస్ యాంటీ-డ్రోన్ పట్రోల్ వాహనంను ప్రారంభించారు. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా సంస్థ 'ఇంద్రజాల్ రేంజర్'ను ప్రత్యేకంగా ప్రదర్శించింది. రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే హాజరయ్యారు.

వివరాలు 

ఇంద్రజాల్ రేంజర్ వంటి వాహనం అనుమానాస్పద డ్రోన్లను గుర్తించి కూల్చగలదు

"భవిష్యత్తులో దేశాల మధ్య యుద్ధాలు కేవలం సైనిక ఆయుధాల మీద మాత్రమే ఆధారపడవు. . వీటిల్లో డ్రోన్స్ పాత్ర ఆందోళనకరంగా మారింది. మన సైనిక బలగాలు పాకిస్థాన్ నుండి తరచుగా ప్రవేశించే డ్రోన్లను సమర్థవంతంగా నిర్వీర్యం చేస్తున్నాయి. ఇంద్రజాల్ రేంజర్ వంటి వాహనం అనుమానాస్పద డ్రోన్లను గుర్తించి కూల్చగలదు. ఇది భద్రత విషయంలో ఒక పెద్ద ముందడుగు. ఇంద్రజాల్ సంస్థను ఈ ప్రభావవంతమైన సాంకేతికత కోసం ప్రత్యేకంగా అభినందిస్తున్నాను," అని ప్రతాప్‌ పాండే పేర్కొన్నారు.

వివరాలు 

26/11 రోజును ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం

ఇంద్రజాల్ రేంజర్ ప్రారంభం కోసం 26/11 దాడి జరిగిన రోజును ఎంచుకోవడానికి కారణాన్ని ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్‌ రాజు వివరించారు. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకే ఈ తేదీని ఎంచుకున్నట్లు చెప్పారు. "ఇక్కడ యువత డ్రగ్స్‌కు వినియోగించే నిధులు పాకిస్థాన్ ఉగ్ర ముఠాలకు వెళ్తున్నాయి.ఈ క్రియలు సరిహద్దు రాష్ట్రాల ప్రజలకు సమస్యల్ని కలిగిస్తున్నాయి. భారత్‌కు మొత్తం భూ సరిహద్దు సుమారు 15,000 కిలోమీటర్లు ఉంది. డ్రగ్ ట్రాఫికింగ్ ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం ఇంద్రజాల్ రేంజర్ వాహనం. ఇది కేవలం యాంటీ-డ్రోన్ పట్రోల్ వాహనం మాత్రమే కాదు, దేశంలోకి డ్రగ్ సప్లై చేసే డ్రోన్లను కూడా నియంత్రించగలదు.

వివరాలు 

ప్రతీ డ్రోన్ మనుషుల ప్రాణాలను, భూభాగాలను కాపాడుతుంది

పరీక్షలలో ఇది 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసింది. ఈ వాహనం సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తుంది.వాహనం హ్యాకింగ్ మెకానిజం, సైబర్-ట్రిగ్గర్ విధానంతో పనిచేస్తుంది. ఇందులోని సాఫ్ట్ స్కిల్ సిస్టమ్.. డ్రోన్‌ను క్యాచ్ చేయడం గానీ లేదా క్రాష్‌ చేయడం గానీ చేస్తుంది.ఇంద్రజాల్ రేంజర్ ద్వారా ఆపే ప్రతీ డ్రోన్ మనుషుల ప్రాణాలను, భూభాగాలను కాపాడుతుంది," అని కిరణ్ రాజు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొలి అటానమస్ యాంటీ డ్రోన్‌ గస్తీ వాహనం ప్రారంభం