రేపు ముంబైలో ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి సమావేశం.. 27 పార్టీల హాజరు
ఈ వార్తాకథనం ఏంటి
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను ఓడించేందుకు లక్ష్యంగా ప్రతిపక్షాల ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) కూటమి గురువారం మూడోసారి సమావేశం అవుతోంది.
ముంబై వేదికగా ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ప్రతిపక్షాల సమావేశం జరగనుంది.
రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పొత్తులతో పాటు, లోగో, సీట్ల పంపకం వంటి అంశాలపై చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
కూటమి సమన్వయ కమిటీ, లోగోను ప్రకటించే అవకాశం తెలుస్తోంది.
కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ రూపొందించడానికి, దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడానికి, సీట్ల భాగస్వామ్యానికి ఉమ్మడి ప్రణాళికలను రూపొందించడానికి కొన్ని ప్యానెల్‌లను ప్రకటించనున్నట్లు సమాచారం.
ముంబైలో సమావేశాలకు 27పార్టీల నుంచి 62 మంది ప్రతినిధులు హాజరుకాబోతున్నారు.
ముంబై
కూటమి కన్వీనర్‌పై చర్చించే అవకాశం
మోదీ పాలనను ఎండగట్టడానికి, దేశ ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ముంబై సమావేశం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందిస్తుందని ఆర్జేడీ నేత మనోజ్ ఝా చెప్పారు.
అలాగే ఇండియూ కూటమి సమన్వయం కోసం ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.
దిల్లీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా కూటమికి నేతృత్వం వహించేందుకు కన్వీనర్‌గా ఎవరు ఉండాలనే దానిపై కూడా సభ్యులు చర్చించనున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ ప్రణాళిలను రూపొందించడటమే లక్ష్యంగా ఎజెండాగా ఉంటుందని ఆర్డేజీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.
సమావేశాల కోసం మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ నేతలు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు.